DOG STEALS THE BAT AND INTERRUPTS THE BASEBALL GAME VIDEO GONE VIRAL CHECK HERE JNK GH
Viral Video: మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లోకి దూసుకొచ్చిన పెంపుడు కుక్క.. బ్యాట్ దొంగిలించి మరీ రచ్చ రచ్చ!
ఆట మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి రచ్చ చేసిన కుక్క (PC: Screen Grab)
గోల్డెన్ రిట్రీవర్ పిచ్‌పై బఫెలో బైసన్స్, లేహీ వ్యాలీ ఐరన్పిగ్స్ అనే రెండు జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా ఒక కుక్క వచ్చి రచ్చ రచ్చ చేసింది.
ఆసక్తిగా సాగుతున్న ఆట మధ్యలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆటగాళ్ల మధ్య సంభాషణ, వారి ముఖ కవళికలు, ప్రేక్షకుల వేశధారణ, ప్లకార్డులు ఇలా ప్రతిదీ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక, తమ అభిమాన ఆటగాడితో సెల్ఫీ దిగేందుకు గ్రౌండ్లోకి దూసుకొచ్చే సన్నివేశాలను అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాంటి వింత సంఘటనే ఇప్పుడు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగింది. అయితే, ఇక్కడ గ్రౌండ్లోకి దూసుకొచ్చింది మనిషి కాదు.. రూకీ అనే ఓ పెంపుడు కుక్క (Dog).
గోల్డెన్ రిట్రీవర్ (Golden Retriever) పిచ్‌పై బఫెలో బైసన్స్, లేహీ వ్యాలీ ఐరన్పిగ్స్ అనే రెండు జట్ల మధ్య బేస్‌బాల్ (Base Ball) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా గ్రౌండ్‌పైకి ఈ పెంపుడు కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. బ్యాట్‌ను నోట కరుచుకొని నానా హంగామా సృష్టించింది. గ్రౌండ్లో అటూ ఇటూ పరిగెత్తుతూ కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఈ వీడియోను ‘మైనర్ లీగ్ బేస్‌బాల్’ తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేయగా.. ఇప్పుడు తెగ వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియో 10 లక్షల వ్యూస్ దక్కించుకుంది.
వాస్తవానికి ఈ పెంపుడు కుక్క ట్రెంటన్ థండర్స్ అనే బేస్‌బాల్ జట్టకు బ్యాట్ డాగ్‌గా పనిచేస్తుంది. ఈ పెంపుడు కుక్కకి బేస్‌బాల్ గ్రౌండ్ కొత్తేమీ కాదు. ఇలా చాలా సార్లు మైదానంలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ సారి ప్లేయర్లను ఆడనీయకుండా బేస్ బాట్‌ను దొంగలించి నోట కరుచుకొని మైదానం నుంచి బయటికి పరుగులు తీసింది. ఏదేమైనా, శునకం మ్యాచ్‌కు అంతరాయం కలిగించినా.. దాని చేష్టలు మైదానంలోని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కాగా, జంతువులు గ్రౌండ్లోకి దూసుకొచ్చిన సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బేస్ బాల్ ఇలా ఏదైనా కావచ్చు.. ఆసక్తిరంగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలోకి దూసుకొచ్చేస్తున్నాయి. ఎటువంటి భయం లేకుండా గ్రౌండ్లో కలియ తిరుగుతున్నాయి. మ్యాచ్‌లో ఇవే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. అసలు మ్యాచ్ వీడియోల కంటే ఇలాంటి వీడియోలే ఎక్కువ వ్యూస్ సంపాదిస్తుంటడం విశేషం.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.