హోమ్ /వార్తలు /క్రీడలు /

Javelin Throw: భారత్‌కు గోల్డ్ మెడల్ అందించిన క్రీడ జావెలిన్ త్రో.. ఈ ఆట ఎక్కడ, ఎలా మొదలైందంటే..

Javelin Throw: భారత్‌కు గోల్డ్ మెడల్ అందించిన క్రీడ జావెలిన్ త్రో.. ఈ ఆట ఎక్కడ, ఎలా మొదలైందంటే..

Neeraj Chopra

Neeraj Chopra

Javelin Throw: టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణాన్ని సాధించే వరకు అసలు ఇలాంటి క్రీడ ఒకటి ఉంటుందని చాలామందికి తెలియదు. చాలామంది ఈ క్రీడ గురించి తమకేమీ తెలియదని.. కానీ ఈ ఆటే ప్రస్తుతం దేశం గర్వించేలా చేసిందని చెబుతున్నారు.

భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) టోక్యో ఒలింపిక్స్‌ (Tokyo Olympics)లో బంగారు పతకాన్ని (Gold Medal) సాధించాడు. అథ్లెటిక్స్‌లో దేశం తరఫున సాధించిన మొదటి బంగారు పతకం ఇదే కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణాన్ని సాధించే వరకు అసలు ఇలాంటి క్రీడ ఒకటి ఉంటుందని చాలామందికి తెలియదు. చాలామంది ఈ క్రీడ గురించి తమకేమీ తెలియదని.. కానీ ఈ ఆటే ప్రస్తుతం దేశం గర్వించేలా చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జావెలిన్ త్రో (Javelin Throw) ఎక్కడ, ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకుందాం. జావెలిన్ త్రో అనేది చాలా పురాతనమైన క్రీడ. పురాతన గ్రీస్ ఒలింపిక్స్‌లో కూడా ఇది భాగంగా ఉండేది. ఇందులో భాగంగా మెటల్ టిప్ ఉన్న ఈటెను వీలైనంత దూరం విసరడానికి అథ్లెట్లు ప్రయత్నిస్తారు. ఇది పూర్వం యుద్దాల్లో కూడా ఉండేది. యుద్ధ విన్యాసాల నుంచే ఈ క్రీడ ఆవిర్భవించిందనే వాదన ఉంది. ఇందులో శక్తి, టైమింగ్, కో ఆర్టినేషన్ వంటివన్నీ సరైన రీతిలో ఉండాలి. జావెలిన్ గ్రిప్ ఉన్న చోట దాన్ని పట్టుకొని విసరాల్సి ఉంటుంది. మగవారు ఉపయోగించే జావెలిన్ 2.6 నుంచి 2.7 మీటర్ల పొడవు.. కనీసం 800 గ్రాములైనా బరువు ఉండాలి. అదే మహిళలు ఉపయోగించే జావెలిన్ 600 గ్రాముల బరువు, 2.2 మీటర్ల నుంచి 2.3 మీటర్ల పొడవు ఉండాలి.

ఇది కూడా చదవండి : " దారి తప్పిపోయాను.. ఆమె లేకపోతే గోల్డ్ మెడల్ కొట్టేవాణ్ని కాదు" ... సినిమాకు మించిన ట్విస్టులు..

1908 లో ఈ క్రీడను ఒలింపిక్స్ లో ప్రవేశ పెట్టారు. సాధారణంగా స్కాండిన్వేనియన్ అథ్లెట్లు ఈ గేమ్ లో మంచి ఫలితాలు సాధించడం మనం గమనించవచ్చు. స్వీడన్‌లో మొదటి జావెలిన్ త్రో చాంపియన్ షిప్ జరిగింది. చెకోస్లోవేకియా అథ్లెట్ జాన్ జెలెనీ అందరి కంటే అత్యుత్తమ ఆటగాడిగా పేరు సాధించాడు. 1992 నుంచి 2000 వరకు వరకు ప్రతి ఒలింపిక్స్ లోనూ విజేతగా నిలిచాడు. 1996 విశ్వక్రీడల్లో 98.48 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డ్ సాధించాడు.

ఇది కూడా చదవండి : 18 ఏళ్ల సచిన్ టెండూల్కర్.. 23 ఏళ్ల అంజలి ప్రేమలో ఎలా పడిపోయాడంటే..

జావెలిన్ త్రోలో విజయం సాధించాలంటే బయో మెకానికల్ ఫ్యాక్టర్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే జావెలిన్ అనేది ఏరో డైనమిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. దాన్ని చేతి నుంచి వదిలే యాంగిల్, స్పీడ్ రెండూ ముఖ్యమే. దీన్ని ఎంత ఎక్కువగా పెంచితే అంత దూరం వెళ్తుంది. అయితే ఎంత వేగంగా జావెలిన్ వెళ్తుంది అనేది దాన్ని రిలీజ్ చేసే ఆఖరి 0.1 సెకన్ పైనే ఆధార పడి ఉంటుంది.

నీరజ్ హర్యానాలోని పానిపట్ దగ్గర్లోని ఖంద్రాకి చెందిన ఓ రైతు కుటుంబంలో పుట్టాడు. 23 సంవత్సరాల ఈ అథ్లెట్ ఒలింపిక్స్‌లో తన రెండో త్రో లో భాగంగా 87.58 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అథ్లెటిక్స్ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు వంద సంవత్సరాల తర్వాత తొలి స్వర్ణాన్ని అందించాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు