DO YOU KNOW THIS INTERESTING FACTS ABOUT QATARS RAS ABU ABOUD STADIUM GH SRD
Ras Abu Aboud stadium: స్టేడియాలందు ఈ స్టేడియం వేరయా..? దీని కథే డిఫరెంట్..
Photo Credit : Twitter
Ras Abu Aboud stadium: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సాకర్ ప్రపంచకప్ కోసం ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు మనం ఇప్పుడు చూస్తున్న సాధారణ మైదానాల్లా ఇది ఉండదు. దీని కథే డిఫరెంట్. అదేంటో చూసేయండి మరి.
యూజ్ అండ్ త్రో వస్తువుల గురించి విన్నారు. యూజ్ అండ్ లీవ్ ప్రాంతాల గురించి వినుంటారు... మరి యూజ్ అండ్ యూజ్ స్టేడియం గురించి ఎప్పుడైనా విన్నారా?.. అలాంటిదే ఒకటి ఇప్పుడు ఖతార్‌లో సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సాకర్ ప్రపంచకప్ కోసం ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు మనం ఇప్పుడు చూస్తున్న సాధారణ మైదానాల్లా ఇది ఉండదు. దీని కథే డిఫరెంట్. అదేంటో చూసేయండి మరి. అది ఖతార్‌లోని రాస్ అబు అబౌడ్ స్టేడియం. సాకర్ ప్రపంచకప్ కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. అంత స్పెషల్ ఏముంది అంటారా? ఇప్పుడు అక్కడ కేవలం మైదానం మాత్రమే ఉంది. కుర్చీలు, సీలింగ్, మిగిలిన వస్తువులు ఏవీ ఉండవు. అంతేకాదు ప్రపంచకప్ టోర్నీ అయ్యాక కూడా అవేవీ అక్కడ ఉండవు. అంటే మ్యాచ్‌లు అయిపోయాక మొత్తం స్డేడియాన్ని దేనికదే విప్పేసి... తీసుకెళ్లిపోతారట.
దోహా పోర్టులో షిప్పింగ్ కంటైనర్ల నుంచి 974 కంటైనర్లను తీసుకొని, వాటి ఉక్కుతో ఈ స్టేడియం పనులు చేపడుతున్నారట. స్టేడియంలో 40 వేల సీటింగ్ సామర్థ్యం ఉంది. ఆ సీట్లన్నీ రిమూవబుల్వే కావడం విశేషం. అంటే రీసైకిల్డ్ విధానంలో ఈ మైదానం రూపొందుతోందన్నమాట. ఇక 974 కంటైనర్లు మాత్రమే వాడటానికీ ఓ కారణం ఉంది. అది ఖతార్ డయలింగ్ కోడ్. దేశ పునరుత్పాదకతను , చిహ్నాన్ని తెలిపేలా ఈ ఏర్పాటు చేశారన్నమాట. ఇది తయారీ గురించి, ఇక మ్యాచ్‌లు అయిపోయాక ఏం చేస్తారంటే... మొత్తం స్టేడీయంలో గ్రౌండ్ మాత్రమే అక్కడ ఉంటుంది. సీలింగ్, కుర్చీలు, ఇతర వస్తువులను అక్కడి నుంచి తరలించేస్తారట. వాటిని వేరే ప్రాంతంలో క్రీడల కోసం, మైదానాల ఏర్పాట్ల కోసం వాడతారట. ఖతార్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాలకూ వాటిని తరలించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది.
రాస్ అబు అబౌడ్ స్టేడియాన్ని దేనికది విప్పేశాక... ఆ సామాగ్రిని రెండు చిన్న స్టేడియంలుగాను, లేదంటే ఓ పెద్ద స్టేడియంగాను మార్చుకోవచ్చని స్టేడియం అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఈ పార్టులను వేరే దేశాలకు డొనేట్ చేయడానికి కూడా ఖతార్ సిద్ధంగా ఉందట. అంతేకాదు పోటీల సమయంలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ను హ్యాండిల్ చేయడానికి స్టేడియం చుట్టూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారట. ఇక్కడ మ్యాచ్‌ల సంగతి చూస్తే... 2022 జూన్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. అన్నట్లు ఇక్కడ ఏడు మ్యాచ్‌లు మాత్రమే జరుగుతాయి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.