PV Sindhu: పీవీ సింధు తండ్రి పీవీ రమణ కూడా అర్జున అవార్డు విజేతే అని తెలుసా? ఏ క్రీడలో అవార్డు దక్కిందంటే..

పీవీ సింధు తండ్రి పీవీ రమణకు అర్జున అవార్డు ఏ ఏడాదిలో వచ్చిందో తెలుసా?

వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఆమె తండ్రి కూడా ఒక క్రీడాకారుడే. ఆయన కూడా అర్జున అవార్డు సాధించిన విషయం తెలుసా?

  • Share this:
    ఒలింపిక్స్‌లో (Olympics) వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా స్టార్ షట్లర్ పీవీ సింధు (PV sindhu) రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ రజత పతకం గెలిచిన సింధు.. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం కొల్లగొట్టింది. ప్రపంచ చాంపియన్ కూడా అయిన సింధు.. ఎన్నో ఏళ్ల నుంచి నిలకడగా రాణిస్తున్నది. దేశంలో క్రికెటేతర క్రీడాకారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వారిలో పీవీ సింధు కూడా ఒకరు. అయితే పీవీ సింధు డీఎన్ఏలోనే అథ్లెట్ల లక్షణం ఉందని చెప్పవచ్చు. ఆమె వాలీబాల్ క్రీడాకారులైన పీవీ రమణ (PV Ramana), విజయలక్ష్మి(Vijaya Laxmi) దంపతులకు జన్మించింది. పీవీ రమణ వాలీబాల్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారుడు. ఆయనకు 2000లో కేంద్ర ప్రభుత్వం అర్జన అవార్డుతో సత్కరించింది. ఇక పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దుకున్నది మాత్రం పుల్లెల గోపీచంద్ వద్దనే. 2001 ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ అయిన పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో సింధు గొప్పగా రాణించింది.

    రియో ఒలింపిక్స్ పతకం తర్వాత పీవీ సింధు కెరీర్‌లో అత్యంత అద్భుతమైన విజయం ప్రపంచ చాంపియన్‌షిప్స్ అని చెప్పవచ్చు. ఆమె 2019లో మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఇప్పటికీ ఆమె ప్రపంచ చాంపియన్‌గానే కొనసాగుతుండటం విశేషం.

    పివి సింధు అవార్డుల జాబితా

    - అంతర్జాతీయ సర్క్యూట్‌, కొలంబోలో జరిగిన 2009 సబ్ జూనియర్ ఆసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు కాంస్య పతక విజేతగా నిలిచింది.

    - 2010 లో ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాలెంజ్‌లో సింగిల్స్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నది.

    - మెక్సికోలో జరిగిన 2009 జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

    - 2010 థామస్ కప్ మరియు ఉబెర్ కప్ సమయంలో సింధు భారత జాతీయ జట్టులో సభ్యురాలు.

    - 2012 లో సింధు ఆసియా యూత్ అండర్ -19 ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 18-21, 21-17, 22-20 తేడాతో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరను ఓడించింది.

    - చైనా ఓపెన్ (బ్యాడ్మింటన్) సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. లండన్ ఒలింపిక్స్ 2012 బంగారు పతక విజేత చైనాకు చెందిన లి జురోను 9-21, 21-16 తేడాతో ఓడించింది.

    - 2013లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పివి సింధు రికార్డులకు ఎక్కింది. ఇందులో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్నది.

    - 2013లో కెనడాకు చెందిన మిచెల్ లీని ఓడించి మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిలో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.

    - పి. వి. సింధు 2013 డిసెంబర్‌లో జరిగిన 78 వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది.
    - ఇవే కాకుండా పివి సింధుకు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ మరియు 2016 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం) లభించాయి.
    Published by:John Naveen Kora
    First published: