DISGRACEFUL SCENES IN A CHARITY MATCH AND VIOLENCE ERUPTED BETWEEN TWO TEAMS IN ENGLAND VIDEO GOES VIRAL SRD
Viral Video : పేదల కోసం ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు...కానీ, చివరికి రక్తం చిందేలా కొట్టుకున్నారు..
Photo Credit : Twitter
Viral Video : క్రికెట్ లో ఆటగాళ్లు అప్పుడప్పుడూ సహనం కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. మైదానంలో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా..అప్పడప్పుడు ప్లేయర్ల మధ్య గొడవలు కామన్ గా జరుగుతుంటాయ్. కానీ, రక్తం చిందేలా కొట్టుకునే గొడవలు జరగడం అరుదు.
క్రికెట్ లో ఆటగాళ్లు అప్పుడప్పుడూ సహనం కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. మైదానంలో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా..అప్పడప్పుడు ప్లేయర్ల మధ్య గొడవలు కామన్ గా జరుగుతుంటాయ్. కానీ, రక్తం చిందేలా కొట్టుకునే గొడవలు జరగడం అరుదు. గల్లీ మ్యాచ్ ల్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాంటి ఘటనే.. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లో జరిగింది. ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షన రక్తసిక్తంగా మారింది. ఇరు జట్ల క్రికెటర్ల మధ్య మాటామాటా పెరిగి చివరికి బ్యాట్లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్లో నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తసిక్తంగా మారడం చర్చనీయాంశంగా మారింది. గొడవకి కారణం ఏంటనే విషయం తెలియలేదు. కానీ, ఈ గొడవకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో ప్రకారం బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇరుజట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగినట్లు స్పష్టమవుతోంది. అనంతరం రెండు గ్రూప్‌ల ఆటగాళ్లు బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గొడవ సద్దుమణిగే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకి తాళలేక కిందపడిపోయి కనిపించారు. దీంతో మ్యాచ్ అర్ధంతరంగా రద్దైంది.
Disgraceful scenes during a charity match which had to be abandoned after a fight between the two teams. The violence erupted at the end of a game at Mote Park Cricket Club in Maidstone during a tournament raising money for those in need of medical treatment in Pakistan pic.twitter.com/uGOYPuc3z2
అయితే, ఈ గొడవ విషయమై మ్యాచ్ నిర్వహకుడు షెహజాద్ స్పందిస్తూ.. ఇది ఫైనల్ మ్యాచ్ అని, మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారని, ఓ ఇద్దరు ముగ్గురు బ్యాట్లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నాడు. మొత్తంగా ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని నాశనం చేశారని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే గొడవకు అసలు కారణం ఏంటన్నది తనకు కూడా తెలియదని అతను చెప్పడం విశేషం. ఇక, వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఛారిటీ మ్యాచ్ అని పేరు చెప్పి గలీజ్ చేశారుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.