ఇంట్లో చెప్పకుండానే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా - హిమాదాస్

వాళ్లు నన్ను టీవీలో చూసి ఆశ్చర్యపోతారని అనుకున్నా... పతకం గెలిచిన తర్వాత ఫోన్ చేస్తే పడుకున్నామని చెప్పారు... - హిమాదాస్

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 29, 2018, 3:01 PM IST
ఇంట్లో చెప్పకుండానే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా - హిమాదాస్
ఏషియాడ్‌లో పతకం సాధించన అనంతరం త్రివర్ణపతకంతో హిమాదాస్
  • Share this:
హిమాదాస్...ఏషియాడ్‌లో మూడు పతకాలు సాధించి, రికార్డు క్రియేట్ చేసిన యువ సంచలనం. అస్సాం రాష్ట్రానికి చెందిన హిమాదాస్‌ను అందరూ ఇప్పుడు ‘దింగ్ ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తున్నారు. 2018 ఏషియాడ్ 400 మీటర్ల ఈవెంట్‌లో50.79 సెకన్ల టైమింగ్‌తో ఇండియన్ నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ పరుగుల సునామీ... ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఫిన్‌లాండ్‌‌లో జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ 20 అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం పతకం సాధించి సంచలనం క్రియేట్ చేసిన హిమాదాస్... ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్న అస్సలు ఇంట్లోనే చెప్పనేలేదని వెల్లడించింది.

నేను అంత పెద్ద అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నాననే విషయం నా తల్లిదండ్రులకు చెప్పలేదు. కేవలం ఓ చిన్న టోర్నీలో పాల్గొంటున్నా అని మాత్రమే చెప్పా. వాళ్లు నన్ను టీవీలో చూసి ఆశ్చర్యపోతారని అనుకున్నా... పతకం గెలిచిన తర్వాత రూమ్‌కి రాగానే మా నాన్నకి ఫోన్ చేశాను. అప్పుడు ఆయనమో నిద్రపోతున్నా...అని అన్నాడు. నేనిక్కడ వరల్డ్ ఛాంపియన్ అయ్యాను. నువ్వేమో నిద్రపోతున్నావా...రేపొద్దున చెబుతా మీ పని! ’ అని ఫోన్ పెట్టేశా...
హిమాదాస్, భారత స్ప్రింటర్


ఐఏఏఎఫ్‌లో స్వర్ణం పతకం గెలిచిన తర్వాత ఏషియాడ్‌లో పాల్గొన్న హిమాదాస్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే రాణించిన హిమాదాస్ ఏకంగా మూడు పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్ 400 మీటర్ల ఈవెంట్‌లో రజతం సాధించిన హిమాదాస్... 4 X 400 మిక్స్‌డే రిలే ఈవెంట్‌లో రజతం, మహిళల 4 X 400 రిలే ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచి, సంచలనం సృష్టించింది.‘ఐఏఏఎఫ్ ఛాంపియన్‌షిప్‌తో పోలిస్తే ఏషియాడ్ పూర్తిగా భిన్నమైంది. అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకునేందుకు బాగా కష్టపడాల్సి వచ్చింది...’ అంటూ ఏషియాడ్ విజయం గురించి చెప్పుకొచ్చింది హిమాదాస్. ఏషియాడ్ విజయం తర్వాత తమ ఊరికి కొత్త రోడ్లు, వీధి దీపాలు రావడం చూసి ఎంతో సంతోషంగా ఉందని గర్వంగా అంటోంది హిమాదాస్. 18 ఏళ్ల హిమాదాస్... ప్రస్తుతం అస్సాం రాష్ట్రానికి స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తోంది.
First published: September 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు