‘ధోనీ జట్టులో ఉంటే ఆ కిక్కే వేరబ్బా... కానీ అది మాత్రం అతని ఇష్టం’...

ధోనీకి క్రికెట్ గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉంది... ఏ ప్లేస్‌లో ఆడాలనేది అతని ఇష్టానికే వదిలేయాలి... యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 9, 2019, 4:30 PM IST
‘ధోనీ జట్టులో ఉంటే ఆ కిక్కే వేరబ్బా... కానీ అది మాత్రం అతని ఇష్టం’...
ధోనీ, యువరాజ్ (Image credit: AP)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 9, 2019, 4:30 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్... ఈ ఇద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగి, విజయాన్ని అందించిన హిట్టర్లు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలోనూ ఈ ఇద్దరి జోష్ మరో స్థాయిలో ఉండేది. ఇద్దరూ కలిసి హీరోయిన్ దీపికా పదుకొనేకి లైన్ వేసినా... ఒకే బైక్‌పై మైదానంలో చక్కర్లు కొట్టినా... ఒకరి భుజాలపై ఒకరు ఎక్కి సంబరాలు చేసుకున్నా వీరికే చెల్లింది. అయితే ఈ స్నేహితుల మధ్య కూడా అనుకోని కలహాలు చెలరేగాయి. యువీకి జట్టులో స్థానం పోవడానికి కెప్టెన్ మాహీయే కారణమని అభిమానులు అభిప్రాయపడ్డారు. యువరాజ్ తండ్రి బాహాటంగానే ధోనీపై ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ 2011 ఫైనల్‌లో జట్టు పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో యువీకి బదులుగా ధోనీ తానే బ్యాటింగ్‌కు రావడం ఈ ఆరోపణలకు తావిచ్చింది.

Cricket, Ind vs NZ, Dhoni, MS Dhoni, Mahendra Singh dhoni in Worldcup, ODi Worldcup 2019, World cup 2019 Schedule, వరల్డ్ కప్ 2019, ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్, ధోనీ - యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనీ, వరల్డ్ కప్ 2019 షెడ్యూల్, టీమిండియా
ధోనీ, యువరాజ్ (పాత ఫోటో)


కొన్నాళ్లకు యువీ క్యాన్సర్‌కు గురి కావడం, మళ్లీ కోలుకుని జట్టులోకి రావడం జరిగిపోయాయి. ఇప్పుడు యువరాజ్ సింగ్ జట్టులో స్థానం కోసం కాకుండా ఓ ఘనమైన రిటైర్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడనే చెప్పాలి. మహేంద్ర సింగ్ పరిస్థితి కూడా దాదాపు అదే. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత మాహీ రిటైర్మెంట్ తీసుకుంటాడని అందరూ భావిస్తున్నారు. ఈ సమయంలో తన పాత స్నేహితుడి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు యువీ.

Cricket, Ind vs NZ, Dhoni, MS Dhoni, Mahendra Singh dhoni in Worldcup, ODi Worldcup 2019, World cup 2019 Schedule, వరల్డ్ కప్ 2019, ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్, ధోనీ - యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనీ, వరల్డ్ కప్ 2019 షెడ్యూల్, టీమిండియా
ధోనీ బైక్ నడుపుతుంటే వెనక కూర్చున్న యువరాజ్ సింగ్ (పాత ఫోటో)
మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. 12 ఏళ్లుగా వికెట్ కీపర్‌గా బ్యాట్స్‌మెన్ వెనక నుంచి క్రికెట్‌ నుంచి ఎంతో దగ్గరగా చూస్తున్నాడు. మంచి కెప్టెన్ కూడా. వరల్డ్‌కప్‌ జట్టులో మాహీ ఉండడం చాలా అవసరం. క్లిష్ట సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కెప్టెన్ విరాట్‌కి ధోనీ సలహాలు ఎంతో అవసరం...
యువరాజ్ సింగ్, క్రికెటర్


ఆస్ట్రేలియా పర్యటనలో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగిన ధోనీ ఫామ్ చూస్తే సంతోషంగా ఉందని చెప్పిన యువీ... అక్కడ అతని బ్యాటింగ్ చూస్తుంటే మునుపటి ధనాధన్ ధోనీ గుర్తుకువచ్చాడని అన్నాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో ఆడాలనే విషయం ధోనీకే వదిలేయాలని విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చాడు యువరాజ్. ఈ ఐపీఎల్ సీజన్‌లో యువీని ముంబయి ఇండియన్స్ జట్టు కోటి రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో తన బ్యాటింగ్ సత్తా చూపించడానికి ఎదురుచూస్తున్నానని, నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు ఈ సిక్సర్ల సింగ్.
ఇది కూడా చదవండి...
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...