ఆ బాల్‌ను బాట్స్‌మెన్ సిక్స్ కొట్టిన ధోనీ మాత్రం బౌలర్‌నే మెచ్చుకుననేవాడు

ఐపీఎల్‌లో చెన్నై సూరర్ కింగ్స్ టీంలో ధోనీ నాయకత్వంలో మురళీధరన్ ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనీ నాయకత్వానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.

Rekulapally Saichand
Updated: August 10, 2020, 12:17 PM IST
ఆ బాల్‌ను బాట్స్‌మెన్ సిక్స్ కొట్టిన ధోనీ మాత్రం బౌలర్‌నే మెచ్చుకుననేవాడు
ఐపీఎల్‌లో చెన్నై సూరర్ కింగ్స్ టీంలో ధోనీ నాయకత్వంలో మురళీధరన్ ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనీ నాయకత్వానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
  • Share this:
ఎమ్‌ఎస్ ధోనీ విలక్షణ నాయకత్వం,నిరాడంబర తత్వం అతన్ని క్రికెట్‌లో శీకర తీరాలలో నిలబెట్టింది. చాలా మంది ఆటగాళ్ళకు తనో మార్గదర్శకుడిగా నిలిచాడు. ధోనీ సారధిగా ఉంటే ఏదైనా సాధించగలమనే విశ్వాసం ఆటగాళ్లలో కల్గుతుంది. ఆయన నాయకత్వ లక్షణాలపై ఎనలేని విశ్వాసం కలగడంతో ప్రపంచం మొత్తం ధోనీ ది గ్రేట్ అంటూ ప్రశంసిస్తోంది. చాలా మంది జూనీయర్,సినీయర్ క్రికెటర్లు పొగడ్తలతో ముంచెత్తారు. తాజా ఆ జాబితాలో మరో క్రికెటర్ చేరారు.

ఇండియా ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ యూట్యూబ్ ఛానల్‌లో డిఆర్‌ఎస్ విత్ యాష్‌ చాట్ షోలో పాల్గోన్నా శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పలు విషయాలను వెల్లడించారు. ఈ షోలో ధోనీ కెప్టెన్సీపై ప్రశసంల జల్లు కురిపించారు. " ఫీల్డర్లను మార్చుకునే విషయంలో బౌలర్లకు ఇష్టం మేరకు వదిలేస్తారు. 2007 ప్రపంచ కప్‌లో యువనాయకుడుగా ధోనీ టీమిండియాను నడిపిన తీరు అద్భుతం. ఫీల్డ్ సెట్ చేసుకునే విషయంలో బౌలర్లు పూర్తి స్వేఛ్చనిస్తాడన్నారు"

ఐపీఎల్‌లో చెన్నై సూరర్ కింగ్స్ టీంలో ధోనీ నాయకత్వంలో మురళీధరన్ ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనీ నాయకత్వానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. బాట్స్‌మెన్ మంచి బంతిని సిక్సర్‌గా మలిచినప్పుడు అందరూ బాట్స్‌మెన్‌ను ప్రశంసిస్తే ధోనీ మాత్రం బౌలర్‌ను ప్రశస్తూ చప్పట్లతో కిర్తించేవారన్నారు. ఎంత టాలెంట్‌తో బౌల్ చేస్తామో అంతే సమయస్పూర్తితో బాట్స్‌మెన్ ఆడే ప్రయత్నం చేస్తాడని బౌలర్‌కు చేప్పేవాడన్నారు.
Published by: Rekulapally Saichand
First published: August 10, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading