MS Dhoni | టీమిండియాకు సెలవు పెట్టి... దేశ సేవలో ధోనీ..?
MS Dhoni | ముఖ్యంగా విండీస్ టూర్‌కు దూరంగా ఉన్న ధోనీ రాబోయే రెండు నెలలు పారాచూట్ రెజిమెంట్‌లో ధోని సేవలందించన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు బీసీసీఐ కార్యవర్గానికి ఇన్ఫర్మేషన్ సైతం కూడా పంపినట్లు తెలుస్తోంది.
news18-telugu
Updated: July 20, 2019, 10:21 PM IST

ఎంఎస్ ధోనీ (ఫైల్ చిత్రం)
- News18 Telugu
- Last Updated: July 20, 2019, 10:21 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ వార్తలు జోరుగా కొనసాగుతున్నప్పటికీ, మిస్టర్ కూల్ ధోనీ మాత్రం తాను అందరి ఊహాగానాలకు చెక్ పెడుతూ నిర్ణయం తీసుకున్నాడు. భారత సైన్యంలో చేరి దేశ సేవకు అంకితమయ్యే దిశగా ధోనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విండీస్ టూర్‌కు దూరంగా ఉన్న ధోనీ రాబోయే రెండు నెలలు పారాచూట్ రెజిమెంట్‌లో ధోని సేవలందించన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు బీసీసీఐ కార్యవర్గానికి ఇన్ఫర్మేషన్ సైతం కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే విండీస్ టూర్‌కు మహీ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రెండు నెలలు ఆర్మీలో చేరి సేవలందిస్తానని లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని పేర్కొన్నట్లు ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే ధోనీ గతంలో తాను క్రికెట్‌కు దూరమైతే ఆర్మీలోనే చేరుతానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సరిగ్గా అదే మాట ప్రకారం ధోనీ నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.
ఇదిలా ఉంటే ధోనీ గతంలో తాను క్రికెట్‌కు దూరమైతే ఆర్మీలోనే చేరుతానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సరిగ్గా అదే మాట ప్రకారం ధోనీ నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.
అప్పటివరకు ఏమీ అడగవద్దు.. సస్పెన్స్‌లో పెట్టేసిన ధోనీ..
India vs Bangladesh: చేతులెత్తేసిన బంగ్లాదేశ్...తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌట్
సచిన్ 30 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల అమ్మాయి..
ఐపీఎల్ ఆరంభ వేడుకలు రద్దు... బీసీసీఐ సంచలన నిర్ణయం..
బీసీసీఐలో దుమారం రేపుతోన్న అనుష్క శర్మ ‘టీ కప్’
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ.. అంతకుముందు ఆ అరుదైన ఘనత సాధించింది మన తెలుగువాడే..
Loading...