హోమ్ /వార్తలు /క్రీడలు /

2011 World Cup : ధోని వర్సెస్ గంభీర్.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఎవరి నాక్ కీలకం అంటూ పోల్.. రిజల్ట్ ఏంటంటే?

2011 World Cup : ధోని వర్సెస్ గంభీర్.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఎవరి నాక్ కీలకం అంటూ పోల్.. రిజల్ట్ ఏంటంటే?

ధోని, గంభీర్ (ఫైల్ ఫోటోస్)

ధోని, గంభీర్ (ఫైల్ ఫోటోస్)

2011 World Cup : ఏప్రిల్ 2, 2011.. భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు. ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంతో చిన్నపిల్లాడిలా గెంతులు వేసిన రోజు. 28 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచినరోజది.

ఇంకా చదవండి ...

2011 World Cup : ఏప్రిల్ 2, 2011.. భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు. ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంతో చిన్నపిల్లాడిలా గెంతులు వేసిన రోజు. 28 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచినరోజది. భారత్ (India) వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక (Sri Lanka)పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ధోని (MS Dhoni) కొట్టిన మ్యాచ్ విన్నింగ్స్ సిక్సర్ ఇప్పటికీ ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి గుర్తే. ఇది జరిగి ఇప్పటికే 11 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా కొందరు అభిమానులు ఈ ఫైనల్ కు చెందిన ఒక విషయంపై ఇప్పటికీ చర్చిస్తూనే ఉంటారు. అదే.. తుది పోరులో గౌతం గంభీర్ (122 బంతుల్లో 97; 9 ఫోర్లు) నాక్ కీలకమా లేక కెప్టెన్ ధోని (79 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమా అని.

తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ స్పోర్ట్స్ (SportsKeeda) కీడా దీనికి సంబంధించిన ట్వీట్ ఒకటి పెట్టింది. టైమ్ టు సెటిల్ ద డిబేట్ అంటూ శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఎవరి నాక్ కీలకం అంటూ ధోని, గంభీర్ ఇన్నింగ్స్ లపై మరోసారి చర్చకు తావిచ్చింది. ఒకసారి మ్యాచ్ జరిగిన విధానాన్ని పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. మహేళా జయవర్ధనే (88 బంతుల్లో 103, 13 ఫోర్లు) సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక తుది పోరులో ఛేజింగ్ అంటే అంత సులభమైన విషయం కాదు. 2003 వరల్డ్ కప్ భారత అభిమానుల మదిలో ఇప్పటికీ గుర్తుండే ఉంది. ఛేజింగ్ ఆరంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు.

తొలి ఓవర్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (0) డకౌట్ అయ్యాడు. మరికాసేపటికే సచిన్ టెండూల్కర్ (18) అవుటయ్యాడు. దాంతో భారత్ 31 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్ విరాట్ కోహ్లీ (35)తో జతకట్టిన గౌతం గంభీర్ జట్టును నడిపించాడు. ఒకసారి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి అద్భుత డైవ్ తో తప్పించుకున్న అతడు మూడో వికెట్ కు 83 పరుగులు జోడించాడు. దిల్షాన్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చిన కోహ్లీ పెవిలియన్ కు చేరాడు. అయితే ఇక్కడ యువరాజ్ సింగ్ స్థానంలో ధోని బ్యాటింగ్ లో వచ్చి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 170 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. గంభీర్, ధోని అద్భుతంగా ఆడుతూ భారత్ ను విజయానికి చేరువ చేశారు. అయితే దురదృష్టవశాత్తూ గంభీర్ 97 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యి సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ తో కలిసి ధోని మ్యాచ్ ను ముగించాడు.

ఇక ఇందులో ధోని, గంభీర్ ఇద్దరి ఇన్నింగ్స్ లు కూడా చాలా కీలకమైనవి. కష్టసమయంలో గంభీర్ ఆదుకుంటే.. ధనాధన్ షాట్లతో ధోని మ్యాచ్ ను ముగించి టీమిండియాకు గ్రాండ్ విక్టరీని అందించాడు. ఇక స్పోర్ట్స్ కీడా పెట్టిన ట్వీట్ కు ఫ్యాన్స్ బాగానే రెస్సాండ్ అయ్యారు. ఇద్దరివీ కీలక ఇన్నింగ్స్ లే అంటూ కామెంట్స్ చేశారు. అదే సమయంలో ఇటువంటి ట్వీట్స్ వల్ల ప్రయోజం లేదంటూ ఘాటుగా బదులిచ్చారు. మరికొందరేమో ఇద్దరివీ మంచి ఇన్నింగ్స్ లే అంటూనే గంభీర్ బ్యాటింగ్ కు వచ్చినపుడు టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉందని కాబట్టి ధోని కంటే కూడా గంభీర్ ఇన్నింగ్స్ కీలకం అని కామెంట్స్ చేశారు. ఒక 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో కూడా గౌతం గంభీర్ (54 బంతులతో 74; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

First published:

Tags: Cricket world cup 2011, Gautam Gambhir, MS Dhoni, Sachin Tendulkar, Virat kohli, Virender Sehwag, Yuvraj Singh

ఉత్తమ కథలు