IPL 2021 : ధోనీకి అవన్నీ ముందే తెలిసిపోతాయా? రవీంద్ర జడేజా క్యాచ్‌లపై ఆసక్తికరమైన ట్వీట్

ఆ ట్వీట్ చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు..!

  • Share this:
    చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ఎంఎస్ ధోనీకి (MS dhoni) భవిష్యత్ ముందే తెలిసిపోతుందా? అతడికి మ్యాచ్‌లో ఏం జరగబోతుందో ఊహించే శక్తి ఉన్నదా? అంటే ఈ ట్వీట్ చూస్తే నిజమేనని అనిపించక మానదు. ధోనీ మ్యాచ్ జరిగే సమయంలో ఎవరితో బౌలింగ్ వేయించాలి? ఎవరిని ఎక్కడ మోహరించాలనే విషయం బాగా తెలిసిన కెప్టెన్. సోమవారం రాత్రి వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టింది. దీంతో 45 పరుగుల తేడాతో విసయం సాధించింది. బ్యాటింగ్‌లో విఫలమైన రవీంద్ర జడేజా (7) బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా ధాటిగా ఆడుతున్న జాస్ బట్లర్ (49) వికెట్ తీశాడు. అంతే కాకుండా మన్నన్ వోహ్రా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కత్‌ల క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో నెటిజన్లు రవీంద్ర జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు ధోనీ ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ధోనీ జడేజా క్యాచ్‌ల విషయంపై 2013లో చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా వైరల్ చేస్తున్నారు.

    2013 ఏప్రిల్ 9న ధోనీ చేసిన ట్వీట్‌లో 'సర్ జడేజా క్యాచ్ కోసం పరుగెత్తడు. బంతులే జడేజా ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతని చేతుల్లో పడుతుంటాయి' అని పేర్కొన్నాడు. సోమవారం నాటి మ్యాచ్‌లో కూడా జడేజా చేతుల్లోకి పోవాలనే ఆరాటంలో బంతులు ఉన్నట్లు కనిపించాయి. ప్రస్తుతం ఈ ట్వీట్‌ను చెన్నై ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ ట్వీట్ మరోసారి నిజమైందని ఒక నెటిజన్ అంటే.. ఈ రోజు మ్యాచ్ చూసి ఈ ట్వీట్ మళ్లీ గుర్తుకు వచ్చిందని మరొక అభిమాని అన్నారు.

    కాగా, క్రికెట్‌లో గతంలో చేసిన ట్వీట్లు నిజమైన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో జోఫ్రా ఆర్చర్ ట్వీట్లు ప్రధానమైనవి. అతడు గతంలో ఎప్పుడో చేసిన ట్వీట్లను ప్రస్తుత మ్యాచ్‌లతో పోల్చుతూ అభిమానులు ఆర్చర్ ఒక నోస్ట్రాడామస్ అని అంటుంటారు.





    కరోనా మహమ్మారి, ప్రపంచ కప్, మోడీ 9 నిమిషాల ద్వీపాల గురించి అతడు ముందే ట్వీట్ చేసిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. గత సీజన్‌లో సీఎస్కేపై వరుసగా నాలుగు సిక్సులు బాదాడు. అయితే 2015లో జనవరిలో జోఫ్రా ఆర్చర్ 6 6 6 6 అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. 'ఎక్కడికీ పరిగెత్తలేని రోజు ఒకటి వస్తుంది' అంటూ ఆర్చర్ చేసిన ట్వీట్ కరోనా గురించే అని అభిమానులు అంటుంటారు. ఇప్పుడు ఆర్చర్ లాగా ధోనీ మారిపోయాడని అంటున్నారు.
    Published by:John Naveen Kora
    First published: