Home /News /sports /

DHONI NEWS INDIAN FORMER OFF SPINNER HARBHAJAN SING REVILED DHOONI SECRET SJN

Dhoni Viral news: ధోని గురించి మతి పోయే విషయం... క్రికెట్ కంటే కూడా అతడు ఏ ఆటను ఎక్కువగా ఆడాడంటే?

ధోని (ఫైల్ ఫోటో)

ధోని (ఫైల్ ఫోటో)

MS Dhoni Viral news: మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. భారత్ కు రెండు ప్రపంచ కప్ లతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా అందించాడు. అయితే ధోని గురించి ఒక ఆసక్తికర విషయాన్ని భారత వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ బయట పెట్టాడు. అదేంటో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
MS Dhoni Viral news: మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) భారత క్రికెట్ జట్టు () లో ఇతడో సంచలనం. జార్ఖండ్ డైనమైట్ గా టీమిండియా (Team India)లో ప్రవేశించిన ధోని... తక్కువ కాలంలోనే భారత జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు.  మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మిస్టర్ కూల్ గా కూడా ప్రశంసలు అందుకున్నాడు. 2007 వన్డే ప్రపంచ కప్ (World Cup)లో దారుణ వైఫల్యం తర్వాత భారత్ కు కెప్టెన్ గా ఎంపికైన ధోని... 2008 లో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్ లో టీమిండియాను విశ్వ విజేతగా నిలిపాడు. అనంతరం 2011లో వన్డే ప్రపంచ కప్ ()ను సాధించి 28 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ ను విశ్వ వేదికపై చాంపియన్ గా నిలిపి కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేశాడు.  అయితే తాజాగా ధోని గురించి  మతిపోయే  ఒక విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan singh) బయట పెట్టాడు. అదేంటో తెలుసుకోవాలని ఉందా అయితే చదవండి.

ధోనికి క్రికెట్ తో పాటు బైక్ నడపడం... ఫుట్ బాల్ (Foot ball) ఆడటం ఇష్టమని మనందరికీ తెలుసు. అయితే ధోని గురించి తెలియని మరో విషయం కూడా ఉంది. దానినే ఇప్పడు హర్భజన్ సింగ్ బయట పెట్టాడు. ధోని తన కెరీర్ లో ఒక గేమ్ ను క్రికెట్ కంటే కూడా ఎక్కువగా ఆడినట్లు హర్బజన్ పేర్కొన్నాడు. ఏముంటిందిలే క్రికెట్ కంటే ముందుగా ధోని ఫుట్ బాల్ లో గోల్ కీపర్ గా ఉన్నాడు. సో... ఫుట్ బాల్ ను ఎక్కువగా ఆడింటాడులే అని మీరందరూ భావిస్తుంటే... మీరు బిగ్ నో బాల్ వేసినట్లే. ఎందుకంటే ధోని ఫుట్ బాల్ ను కాకుండా మరో గేమ్ ను తన జీవితంలో క్రికెట్ కంటే కూడా ఎక్కువగా ఆడాడు. అదే వర్చువల్ గేమింగ్ అయిన ఈ స్పోర్ట్స్ (Esports). అవును ధోని ఎలక్ట్రానికి గేమింగ్ కు పెద్ధ ఫ్యాన్ అంట. క్రికెట్ కంటే కూడా 15 రెట్లు ఎక్కువ సార్లు ఈ స్పోెర్ట్స్ ను ఆడినట్లు భజ్టీ తెలిపాడు. ఈ స్పోర్ట్స్ గేమ్స్ అయిన పబ్ జీ (PUB G), ఫుట్ బాల్ ఆడాడని టర్బోనేటర్ తెలిపాడు.

’ అవును, టీమిండియా (Team India)లో చాలా మంది ఈ స్పోర్ట్స్ కు ఫ్యాన్స్. నేను కూడా ఆడతాను. భారత మాజీ సారథి ధోని కూడా ఈ స్పోర్ట్స్ ను ఆడతాడు. క్రికెట్ కంటే కూడా ధోని ఈ స్పోర్ట్స్ ను 15 రెట్లు ఎక్కువగా ఆడి ఉంటాడు. మీరు ధోనిని హోటల్ రూమ్ లో చూస్తే...  అతడు ఈ స్పోర్ట్స్ ను ఆడుతూ కనిపిస్తాడు. కొన్నిసార్లు ఫిఫా, మరికొన్ని సార్లు పబ్ జీ, ఇంకొన్ని సార్లు ఇతర వర్చువల్ గేమ్స్ ను ఆడుతూ ఉంటాడు‘ అని స్పిన్ లెజెండ్ హర్భజన్ పేర్కొన్నాడు. వరల్డ్ ఈ స్పోర్ట్స్ కప్ ఈవెంట్ బహుమతుల ప్రాదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Harbhajan singh, MS Dhoni, PUBG, Team India, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు