HOME »NEWS »SPORTS »dhoni mania in pakistan fans made pakistan team jersey with ms dhoni name during cricket worldcup 2019 cr

పాకిస్థాన్ జెర్సీపై మహేంద్రసింగ్ ధోనీ పేరు... దాయాది దేశంలోనూ మాహీ మానియా...

పాకిస్థాన్ జెర్సీపై మహేంద్రసింగ్ ధోనీ పేరు... దాయాది దేశంలోనూ మాహీ మానియా...
మహేంద్ర సింగ్ ధోని

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ధోనీ పేరుతో ఉన్న పాకిస్థాన్ జెర్సీలు... వరల్డ్‌కప్‌లో స్టేడియంలో హంగామా చేసేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్‌లో ఉన్న ధోనీ ఫ్యాన్స్...

  • Share this:
    ప్రపంచంలో క్రికెట్ ఆడే ఏ దేశంలో అయినా క్రికెటర్లకు అభిమానులు ఉంటారు. భారతదేశంలో మాత్రం క్రికెటర్లకు వీరాభిమానులు ఉంటారు. అభిమానులు అనే కంటే భక్తులు అనే పదం సరైనదేమో. ఒకప్పుడు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను దేవుడిగా ఆరాధించిన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థాయిలో మరో క్రికెటర్ ఫాలోయింగ్ తెచ్చుకోలేడని ప్రచారం జరిగింది. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అభిమానుల ఆరాధ్యదైవంగా ఎదిగిపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీకి మాస్ ఆడియోన్స్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. మాహీకి జట్టులో స్థానం దక్కకపోతే క్రికెట్ చూడడం మానేస్తామంటూ ఓ దశలో సోషల్ మీడియాలో ఆందోళన కూడా చేపట్టారు ధోనీ ఫ్యాన్స్. ఇక్కడంటే మహేంద్ర సింగ్ ధోనీకి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉండొచ్చు గానీ... దాయాది పాకిస్థాన్‌లో మాహీ మానియాని ఊహించగలమా? అయితే సాధ్యం కాని ఈ అరుదైన ఘనతను సాధించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2015లో ఓ పాక్ క్రికెట్ అభిమాని... ధోనీ పేరు ఉన్న జెర్సీతో స్టేడియంలో సందడి చేశాడు. భారత జట్టు గెలిచిన తర్వాత మాహీ మీద అభిమానంతో ఇంటి ముందు భారత జెండా ఎగురవేసి చిక్కుల్లో ఇరుక్కున్నాడో ధోనీ ఫ్యాన్. ఇదంతా గతం ఇప్పుడు వరల్డ్‌కప్‌ ప్రారంభం కాబోతున్న తరుణంలో మాహీ కోసం పాకిస్థాన్ జెర్సీని సిద్ధం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.





    ధోనీ పేరుతో ఉన్న పాకిస్థాన్ జెర్సీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సచిన్ టెండూల్కర్‌ ఎంతటా మేధావి క్రికెటర్ అయినా దాయాది దేశస్థులు ఆయన్ని ఇంతగా అభిమానించలేదు. కేవలం మహేంద్రసింగ్ ధోనీకి మాత్రమే ఇంతటి పాపులారిటీ సొంతమైందని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
    First published:May 24, 2019, 20:24 IST

    टॉप स्टोरीज