WTC Final : కోహ్లీ కంటే ధోనీనే బెస్ట్ కెప్టెన్.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నేపథ్యంలో సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన చర్చ..

ధోనీనే బెస్ట్ కెప్టెన్ అంటున్న టీమ్ ఇండియా అభిమానులు (ICC)

సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలయ్యింది. దీంతో మరోసారి కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ ఈవెంట్ల దగ్గరకు వచ్చే సరికి కోహ్లీకి చెత్త రికార్డు ఉన్నది. దాన్ని మరోసారి కొనసాగించాడు.

  • Share this:
    టీమ్ ఇండియాకు (Team India) ఐసీసీ ఈవెంట్ల (ICC Events) శాపం పట్టుకున్నట్లు ఉన్నది. గత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో ఏడు సార్లు ఫైనల్స్‌కు చేరుకొని మరి ఓటమిని కొని తెచ్చుకుంది. ప్లేఆఫ్స్, నాకౌట్ దశకు సులభంగానే చేరుకుంటున్న టీమ్ ఇండయాకు చివరి మొట్టుపై బోల్త పడటం పరిపాటిగా మారిపోయింది. అయితే ఎంఎస్ ధోనీ (MS dhoni) ఉన్నప్పుడు ఇలాంటి భయాలు ఏమీ లేవు. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి టీమ్ ఇండియా ఫైనల్ ఫోబియా పట్టుకున్నది. అందుకే కోహ్లీకి కెప్టెన్‌గా ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా లేకుండా పోయింది. ఆటగాడిగా వరల్డ్ కప్‌ అతడి ఖాతాలో ఉన్నా.. కెప్టెన్‌గా మాత్రం సాధించలేకపోవడం పెద్ద లోటే అని చెప్పుకోవాలి. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడుతుంటే.. టీమ్ ఇండియా టాపార్డర్ మాత్రం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. దీంతో కివీస్ బౌలర్లు మన బ్యాట్స్‌మెన్‌ను దెబ్బకొట్టారు. ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ కోహ్లీ... రెండు సార్లూ కేల్ జేమిసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో టీమ్ ఇండియా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంఎస్ ధోనీ హయాంలో అతడి కెప్టెన్సీని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

    ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 4 సార్లు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కు వెళ్లగా మూడింట భారత జట్టు విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. కానీ కోహ్లీ కెప్టెన్‌గా మారిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లల్లో టీమ్ ఇండియా అద్భుతంగా రాణిస్తున్నది. అయితే ఐసీసీ ఈవెంట్ల వద్ద మాత్రం చతికిల పడుతున్నది. కోహ్లీ కెప్టెన్సీలో 6 సార్లు ఫైనల్‌కు వెళ్లగా ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఇద్దరినీ పోలుస్తూ ట్వీట్లు పెడుతున్నారు.



















    ఐసీసీ రికార్డులు చూసుకుంటూ ఇటీవల కాలంలో భారత జట్టు 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకున్నది. ఇక టీమ్ ఇండియా తర్వాత పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్నది. ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నీలో అయినా భారత జట్టు ఫైనల్ ఫోబియాను వదిలించుకుంటుందో లేదో చూడాలి.
    Published by:John Naveen Kora
    First published: