ఇండియన్ ఆర్మీలో ధోని చేసే డ్యూటీ ఏంటో తెలిస్తే షాకవుతారు...?

ధోనీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు నెలల పాటు పారాచూట్ ఆర్మీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ధోనీ భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోగా దీనికి భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంగీకారం తెలిపడంతో ధోనీ సైన్యంలో సేవలు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

news18-telugu
Updated: July 22, 2019, 3:54 PM IST
ఇండియన్ ఆర్మీలో ధోని చేసే డ్యూటీ ఏంటో తెలిస్తే షాకవుతారు...?
ధోనీ ( ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: July 22, 2019, 3:54 PM IST
ఆర్మీ బెటాలియన్‌లో సేవలు అందించేందుకు మిస్టర్ కూల్ క్రికెటర్ ఎంఎస్‌ ధోని చేసుకున్న దరఖాస్తునకు భారత ఆర్మీ నుంచి అంగీకారం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆమోద ముద్ర వేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని ధోనీ స్వయంగా పేర్కొన్న నేపథ్యంలో తుది జట్టులో ఆయన స్థానంలో రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు నెలల పాటు పారాచూట్ ఆర్మీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ధోనీ భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోగా దీనికి భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంగీకారం తెలిపడంతో ధోనీ సైన్యంలో సేవలు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఇదిలా ఉంటే ప్యారాచూట్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌లో రెండు నెలల పాటు సాధారణ సైనిక శిక్షణ తీసుకోనున్నారు. ధోనీ గౌరవ్ లెఫ్టినెంట్ కల్నల్ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను ఎలాంటి ప్రత్యక్ష సైనిక విధుల్లో పాల్గొనేందుకు అనుమతి ఉండదని, అలాగే కల్నల్ హోదాలో ఆయన సైనిక కార్యకలాపాల్లో ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని సన్నిహిత వర్గాలు తేల్చుతున్నారు. కేవలం శిక్షణ పొందేందుకు మాత్రమే అనుమతిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కాగా ధోనీ 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ బెటాలియన్ లోనే పారచూట్ శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. పారాట్రూపర్ గా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకొని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో దూకి శిక్షణ పొందారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు.

అయితే ఆగ్రాలో ధోనీ శిక్షణ పొందిన నెలరోజుల పాటు సాధారణ సైనికుడిగానే ఉన్నాడని, తోటి సైనికులతోనే గది, భోజనం పంచుకున్నాడని సైనిక వర్గాలు తెలిపాయి. సైనిక పారాట్రూపర్ తరహాలో క్రమశిక్షణ తప్పకుండా తనకు కేటాయించిన పారచూట్ ను మడతపెట్టుకొని భద్రంగా చూసుకునే వారని, సాధారణ సైనికుల తరహాలోనే అన్ని రకాల సైనిక డ్రిల్స్ లో పాల్గొన్నారని తెలిపారు. ధోనీ వద్ద ఆడీ కార్ ఉన్నప్పటికీ ఆ నెల రోజులు మాత్రం ఆర్మీ కేటాయించిన జిప్సీ వాహనంలోనే తిరిగారని గుర్తుచేసుకున్నారు. అంతే కాదు ధోనీ సైనిక శిక్షణలో భాగంగా గన్ ఫైరింగ్, ఆయుధాల నిర్వహణ వంటివి నేర్చుకున్నట్లు తెలిపారు.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...