హోమ్ /వార్తలు /క్రీడలు /

INDvsPAK: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన ఎంఎస్ ధోనీ.. ఇంతకు ఏం చెప్పాడు?

INDvsPAK: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన ఎంఎస్ ధోనీ.. ఇంతకు ఏం చెప్పాడు?

పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన ఎంఎస్ ధోని

పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా ఓడిపోతుందని ముందే చెప్పిన ఎంఎస్ ధోని

ధోనీ ఈ ఓటమిని ఐదేళ్ల క్రితమే ఊహించాడు. విన్నింగ్ రికార్డుతో గర్వపడాల్సిన అవసరం లేదని.. ఏదో ఒక సమయంలో మనమూ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని ధోనీ 2016లో టీ20 వరల్డ్ కప్ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఇంకా చదవండి ...

చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్థాన్ (India Vs Pakistan) జట్లు గతంలో ప్రపంచకప్ (World Cup) మ్యాచ్‌ల్లో 12 సార్లు తలపడ్డాయి. ఈ పన్నెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే (Team India) గెలిచింది. అయితే ఆదివారం జరిగిన వరల్డ్ కప్ టీ20 (T20 World Cup) మ్యాచ్‌లో మాత్రం టీమిండియా పది వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. పాకిస్థాన్‌పై అజేయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ ఈసారి కూడా విజయం సాధిస్తుందని చాలా మంది భావించారు. 13-0 ఆధిక్యంతో మరో రికార్డు నెలకొల్పుతుందని అందరూ అంచనా వేశారు. నిజానికి మ్యాచ్‌కు ముందు ఒక్కరు తప్ప మిగతా ఇండియన్స్ వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆ ఒక్కరే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ..!

ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ ఓటమిని ఐదేళ్ల క్రితమే ఊహించాడు. విన్నింగ్ రికార్డుతో గర్వపడాల్సిన అవసరం లేదని.. ఏదో ఒక సమయంలో మనమూ ఓటమిని చవిచూడాల్సి వస్తుందని ధోనీ 2016లో టీ20 వరల్డ్ కప్ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

"మేం పాకిస్థాన్‌పై వరుసగా 11 మ్యాచుల్లో గెలుపొందామని గర్వంగా ఉన్నవారు ఒక వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే ఏదో ఒక సమయంలో మనం కూడా ఓడిపోతాం. ఆ సమయం బహుశా ఈరోజే రావచ్చు. లేదా 20 ఏళ్ల తర్వాత లేదా 50 ఏళ్ల తర్వాతైనా రావచ్చు. కానీ మనం ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉండటం అసాధ్యం. అది అందరికీ తెలుసు" అని ధోనీ భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను కచ్చితంగా అంచనా వేశారు.

MS Dhoni - IPL team: ఐపీఎల్‌లో కొత్త జట్టు కోసం బిడ్ వేసిన ఎంఎస్ ధోని సంస్థ.. టెండర్ గెలిస్తే సీఎస్కేకు గుడ్ బైఅప్పట్లో ధోనీ నేతృత్వంలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. కానీ అయిదేళ్ల తర్వాత ధోనీ ముందుగా ఊహించినట్లే.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను పాకిస్థాన్‌ మట్టికరిపించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌ ఓపెనర్ బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ అజేయ అర్ధ సెంచరీలతో 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేశారు. దీని ఫలితంగా ఇరుజట్లు 13 సార్లు ప్రపంచకప్ లో పోటీపడితే భారత్ మొదటిసారిగా ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ టీ20లో పది వికెట్ల తేడాతో ఓడిపోవడం కూడా భారత్‌కు ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఓటమి తరువాత ధోనీ మాటలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ధోనీ తెలివైన మాటలతో అంగీకరిస్తూ క్రికెట్ ఆటలో ఏదీ శాశ్వతం కాదని కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు మెంటార్‌గా ఉన్న ధోనీ.. నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అజామ్, ఇమాద్ వసీమ్ వంటి పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ధోనీ చాటిన క్రీడాస్ఫూర్తి అందరినీ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ ధోనీ, పాక్ ఆటగాళ్లు నవ్వుతూ మాట్లాడుతున్న సన్నివేశాలకు సంబంధించి ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్ గా మారాయి.

Published by:John Kora
First published:

Tags: India VS Pakistan, MS Dhoni, T20 World Cup 2021, Team India

ఉత్తమ కథలు