IPL 2021: ధోనీ అంత మాట అన్నాడెందుకు.. ఇక సీఎస్కేకు దిక్కెవరు.. అభిమానుల ఆందోళన..!

ఎంఎస్ ధోనీ వ్యాఖ్యలపై అభిమానుల ఆందోళన [PC : iplt20.com]

  • Share this:
    టీమ్ ఇండియాకు (Team India) ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన మాజీ కెప్టెన్ ధోనీ (MS Dhoni) మాటలు ఎప్పుడూ కచ్చితంగానే ఉంటాయి. వ్యక్తిగతంతంగా కానీ, జట్టు కెప్టెన్‌గా కానీ ఎప్పుడూ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు కెప్టెన్ హోదాలో వెళ్లి అర్దాంతరంగా కెప్టెన్సీకి, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అవుదామని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ గత ఐపీఎల్ (IPL 2021) సీజన్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టును నడిపిస్తున్న ఎంఎస్ ధోనీ.. తన బ్యాటింగ్ తీరుపై స్పష్టమైన సమాధానం చెప్పాడు. గత సీజన్ పేలవ ప్రదర్శన అనంతరం ఈ సీజన్‌లో ఆడిన మూడింటిలో రెండు గెలిచి శుభారంభం చేసింది. సోమవారం రాత్రి ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 45 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. అయితే తొలుత సీఎస్కే బ్యాటింగ్ చేసిన సమయంలో ధోనీ ఆటతీరు ఆందోళనకు గురి చేసింది. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

    ధోనీ బ్యాటింగ్ తీరు ఈ మధ్య చాలా పేలవంగా ఉంటున్నది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఆరు బంతులకు ఒక్క పరుగు కూడా చేయలేదు. ఆ తర్వాత రెండు ఫోర్లతో 18 పరుగులు చేసినా.. యువ బౌలర్ చేతన సకారియా వేసిన బంతికి షాట్ కొట్టబోయి జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతడి బ్యాటింగ్ తీరుపై ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పాడు. 'నేను నెమ్మదిగా ఆడుతున్న విషయం నాకు తెలుసు. నా బ్యాటింగ్ తీరువల్ల చెన్నై సూపర్ కింగ్స్‌కు నష్టం కలిగిస్తుందని అంగీకరిస్తున్నాను. కానీ ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శన చేస్తాననే హామీని నేను ఇవ్వలేను. ఏ క్రికెటర్ అయినా మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పుడు అన్‌ఫిట్ అని అనలేరు. నేను తొలి ఆరు బంతులు వదిలేశానేమో.. కానీ వాటిన ఆడిన తీరు నాకు రాబోయే మ్యాచ్‌లలో ఉపయోగపడతాయేమో చూడాలి. ప్రతీ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తానని నా 24 ఏళ్ల వయసులో చెప్పలేదు. ఇప్పుడు నాకు 40 ఏళ్లు.. ఇప్పుడు కూడా నేను ఎలాంటి హామీ ఇవ్వలేను' అని ధోనీ చెప్పాడు.

    ధోనీ మాటలు విన్న అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. తాను మెరగైన ప్రదర్శన చేస్తానని చెప్పకుండా ఇలాంటి సమాధానం చెప్పడం ఏమిటనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ధోనీ వయసు ప్రకారం చూస్తే ఒకప్పటి ఫినిషింగ్, భారీ హిట్టింగ్స్ ఆశించడం కూడా అత్యశే అవుతుందని కొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా ధోనీ మాటల్లో ఇకపై ఐపీఎల్ కూడా ఆడననే సందేశం ఉందని చెబుతున్నారు. ధోనీనే తాను భారీ ఇన్నింగ్స్ ఆడలేనని చెబుతుంటే.. ఇక సీఎస్కేకు దిక్కెవరని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
    Published by:John Naveen Kora
    First published: