"కౌన్సా నషా కర్తాహై..” (Kaunsa nasha Kartahai) అంటున్న ధనశ్రీ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ధనశ్రీ వర్మ కంపెనీ రూపొందించిన ఈ ఆల్బం ఇన్స్టాగ్రాంలో (Instagram) పోస్ట్ చేసిన 3 గంటల్లో అక్షరాలా 799,677కు పైగా వ్యూస్ ను రాబట్టింది. క్రికెటర్ యుజవేంద్ర చాహల్ (Chahal) సతీమణి అయిన ఈమె ప్రముఖ డ్యాన్సర్ గా.. యూట్యూబర్ రాణిస్తున్నారు. టీం ఇండియా మణికట్టు స్పిన్నర్ గా పేరుగాంచిన చాహల్ సతీమణి ప్రస్తుతం తన డ్యాన్స్ తో చేస్తున్న మ్యాజిక్ మామూలుగా లేదు. #titliyan పేరుతో ఇప్పుడిది తెగ షేర్ అవుతోంది.
స్పోర్టీ లుక్ తో కొత్త పెళ్లి కూతురు..
డిసెంబర్ 22న ప్రేమ పెళ్లి చేసుకున్న చాహల్-ధనశ్రీలు ఇటీవలే హనీమూన్ నుంచి తిరిగి వచ్చారు. కొత్త పెళ్లికూతురిగా చేతినిండా గాజులు వేసుకుని.. స్పోర్టీ లుక్ తో ధన ఈ డ్యాన్స్ ఆల్బం చేయటం విశేషం. ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే తొలుత డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆతరువాత డ్యాన్సింగ్ నే కెరీర్ గా ఎంచుకుని కొరియోగ్రఫర్ గా దూసుకుపోతున్నారు. డ్యాన్సర్ గా ఆమె ఎనర్జీ లెవెల్, ఉత్సాహం, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ సూపర్బ్ అంటూ నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె టాలెంట్ పై వేలల్లో కాంప్లిమెంట్లు పోటెత్తటంతో కామెంట్ బాక్స్ నిండిపోతోంది. వీడియోను పోస్ట్ చేస్తూనే .. "చెప్పండి ఇందులో ఫైర్ ఉందా లేదా" అంటూ ప్రశ్నించారు ధనశ్రీ.
వావ్ ప్రౌడ్ ఆఫ్ యూ: చాహల్
ఈ వీడియోలో తన సతీమణి డ్యాన్సింగ్ స్కిల్ చూసిన భర్త చాహల్ కూడా .. "వావ్ ప్రౌడ్ ఆఫ్ యూ" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. హార్ట్ ఈమోజీతో పాటు కిస్ చేస్తున్న ఈమోజీని కూడా ఆయన పోస్ట్ చేశారు. పంజాబీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ పాట అయిన "తిత్లియా" మ్యూజిక్ ఆల్బంను ప్రముఖ గాయకుడు హార్ధీ సంధూ (Hardy Sandhu) పాడారు. సంధూ, సర్గున్ మెహ్తా గతేడాది చేసిన ఈ మ్యూజిక్ వీడియోకు యూట్యూబ్ లో (Youtube) ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ధనశ్రీ వీడియోలు వైరల్..
చాహల్ తో కౌన్సా నషా కర్తాహై..” (Kaunsa nasha Kartahai) అంటున్న ధనశ్రీ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ధనశ్రీ వర్మ కంపెనీ రూపొందించిన ఈ ఆల్బం ఇన్స్టాగ్రాంలో (Instagram) పోస్ట్ చేసిన 3 గంటల్లో అక్షరాలా 799,677కు పైగా వ్యూస్ ను రాబట్టింది.కౌన్సా నషా కర్తాహై..” (Kaunsa nasha Kartahai) అంటున్న ధనశ్రీ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ధనశ్రీ వర్మ కంపెనీ రూపొందించిన ఈ ఆల్బం ఇన్స్టాగ్రాంలో (Instagram) పోస్ట్ చేసిన 3 గంటల్లో అక్షరాలా 799,677కు పైగా వ్యూస్ ను రాబట్టింది.కలిసి రొమాన్స్ చేస్తున్న ధనశ్రీ .. జూలో జంతువులతో ఆడుకుంటున్న వీడియో కూడా నాలుగున్నర లక్షలకు పైగా లైకులు సంపాదించింది.
"పరి హూం మై..” అనే రీమిక్స్ సాంగ్ కు లయబద్ధంగా చిందులేస్తున్న వీడియోను 3 రోజుల క్రితం ధనశ్రీ అప్ లోడ్ చేయగా 4 లక్షలమందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. 2.8 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్న ధనకు ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉండటమే కాదు అంతకంతకూ వారి సంఖ్య పెరుగుతోంది కూడా.