Home /News /sports /

DEVANG GANDHI SAID KL RAHUL ROHIT SHARMA ARE FIRST CHOICE OPENING PARTNERS FOR ENGLAND T20S SA

ఓపెనర్లుగా వారిద్దరే... ధావన్‌ రిజర్వు ఓపెనర్‌గా ఉంటాడు

టీం ఇండియా (Image : Twitter)

టీం ఇండియా (Image : Twitter)

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉందన్నారు బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దేవాంగ్ గాంధీ. శిఖర్‌ ధావన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారన్నారు.



    ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉందన్నారు బీసీసీఐ మాజీ సెలక్టర్‌ దేవాంగ్ గాంధీ. శిఖర్‌ ధావన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారన్నారు. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. టీ20 సిరీస్ సందర్భంగా ఆయన మాట్లాడిన ఆయన... యువ క్రికెటర్‌ సూర్యకుమార్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.

    "ధావన్‌ను గాయాల బెడద వేధిస్తోంది. అతని బ్యాటింగ్‌లో దూకుడు కనిపించడం లేదు. ఆసీస్ సిరీస్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. తాజాగా జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రాహుల్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించినా విజయవంతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ కూడా సొంతం చేసుకున్నాడు. కావున కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌శర్మ టీమ్‌ఇండియా తొలి ప్రాధాన్య ఓపెనర్లని దేవాంగ్‌ గాంధీ అన్నారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: England, KL Rahul, Rohit sharma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు