ఫుట్‌బాల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హాలీవుడ్ సినిమాల్లో నటించాలనుకుంటున్నట్టు సాకర్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డొ చెప్పారు. గతంలో ఫుట్‌బాల్ స్టార్స్ డేవిడ్ బెక్‌హామ్,విన్నీ జోన్స్,ఎరిక్ కాంటోనా ఫుట్‌బాల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు క్రిస్టియానో కూడా అదే బాటలో వెళ్లాలనుకుంటున్నారు. మైదానంలో తాను చురుగ్గా కదల్లేకపోతున్నాను అని అర్ధమైనరోజు ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటానని చెప్పారు. తాను చాలెంజింగ్‌గా తీసుకునేవాటిల్లో సినిమాలు కూడా ఒకటని, అందుకే రిటైర్మెంట్ తర్వాత సినిమాల్లో కనిపించాలనుకుంటున్నానని తెలిపారు.
నేను ఫుట్‌బాల్‌ను అమితంగా ప్రేమిస్తాను కాబట్టే అన్ని రికార్డులు,టైటిల్స్ సాధించగలిగాను. అందుకు కారణం ఆట పట్ల అంకితభావం కనబర్చడం తప్ప దాని వెనకాల మరే అద్భుతాలు గట్రా ఉండవు. అది నా సక్సెస్ స్టోరీ అయినా.. ఇంకెవరి స్టోరీ అయినా..! ప్రస్తుతం నాకు 34 ఏళ్లు, ఇప్పటికీ ఫిట్ గానే ఉన్నా. జీవితంలో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి 50ఏళ్ల పైబడి బతుకుతానన్న నమ్మకం ఉంది.
— క్రిస్టియానో రొనాల్డొ,పోర్చుగల్ ఫుట్‌బాల్ కెప్టెన్
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.