• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • DESI CRICKET FANS POSTED MEMES ON TWITTER AFTER IPL 2021 SEASON GOT CANCELLED DUE TO CORONA EFFECT SRD

IPL 2021: అంతా భ్రాంతి యేనా..! ఈ సారి కప్ మాదే అనుకుంటే ఇదేందయ్యా ఇది..

IPL 2021: అంతా భ్రాంతి యేనా..! ఈ సారి కప్ మాదే అనుకుంటే ఇదేందయ్యా ఇది..

Photo Credit : Twitter

IPL 2021: క్రికెట్‌ ప్రేమికులు కాస్త నిరాశకు గురైనా, సోషల్‌ మీడియాలో మీమ్స్‌, సెటైరికల్‌ పోస్టులతో హల్‌చల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఒక్క సీజన్‌లోనూ విజేత కాలేకపోయినా ఆర్సీబీ జట్టుకు ఇది భారీ దెబ్బ అని చెప్తున్నారు.

  • Share this:
    భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోన్న వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఐపీఎల్ 2021 సీజన్‌ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐ అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ఐపీఎల్‌లో భాగమైన ఇతర సిబ్బంది భద్రత విషయంలో బీసీసీఐ ఏమాత్రం రాజీపడదని.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఐపీఎల్ 2021 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. దీంతో క్రికెట్‌ ప్రేమికులు కాస్త నిరాశకు గురైనా, సోషల్‌ మీడియాలో మీమ్స్‌, సెటైరికల్‌ పోస్టులతో హల్‌చల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఒక్క సీజన్‌లోనూ విజేత కాలేకపోయినా ఆర్సీబీ జట్టుకు ఇది భారీ దెబ్బ అని చెప్తున్నారు. తాజా సీజన్‌లో ఆర్సీబీ విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి సేన.. ఐదింటిలో గెలుపొందింది. ఇదే జోరును కొనసాగిస్తే కనీసం ఈసారైనా టైటిల్‌ గెలిచే అవకాశం ఉండేదని, కానీ అంతలోనే ఇలా టోర్నీ రద్దు కావడం నిజంగా దురదృష్టకరమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    రద్దు విషయం తెలియగానే.. " అంతా భ్రాంతి యేనా..! ఈ సారి కప్ మాదే అనుకుంటే ఇదేందయ్యా ఇది" అన్నట్లుగా విరాట్‌ కోహ్లి ఇలా నోరెళ్లబెడతాంటూ కొందరు మీమ్స్‌ క్రియేట్‌ చేయగా, మరికొందరు డేవిడ్‌ వార్నర్‌ను సన్‌రైజర్స్‌ తుదిజట్టులోకి తీసుకోనందు వల్లే ఇలా జరిగిందంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా, ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓడిన తరుణంలో.. ఐపీఎల్‌ రద్దవ్వడం వల్ల అత్యంత సంతోషపడే వ్యక్తి కావ్య మారన్‌(సన్‌రైజర్స్‌ సీఈఓ) అని జోకులు పేలుస్తున్నారు. ఇంకొందరేమో... క్రికెటర్ల క్షేమం దృష్ట్యా బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుందని, టోర్నీ నిర్వహణకయ్యే ఖర్చును కోవిడ్‌పై పోరాటానికి ఉపయోగించాలంటూ సలహాలు ఇస్తున్నారు.










    మరి కొందరు.. వీర ఫ్యాన్స్ మీ బ్రతకడానికి ఉన్న కొంచెం ఆశను కూడా చంపేశారుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. డ్రీమ్ 11 లో బెట్టింగ్ చేసే వాళ్లకు కూడా కరోనా షాకిచ్చిందిగా అంటూ మరికొందరూ ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు