DELHI POLICE WAS RESPONDING TO QUERIES REGARDING WEEKEND CURFEW THROUGH A TWITTER Q AND A SESSION AND THEIR HILARIOUS TWEET GOES VIRAL SRD
Viral Tweet : మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్రికెట్ ఆడొచ్చా..? అన్న ప్రశ్నకు ఢిల్లీ పోలీసుల గూగ్లీ..
Cricket
Viral Tweet :ఢిల్లీలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. దీంతో, ఈ కర్ఫ్యూపై ప్రజలకి ఏమైనా సందేహాలుంటే అడగవచ్చని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా కోరారు.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కరోనా (Corona) మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా మళ్ళీ కోరలు చాస్తున్న పరిస్థితులకు ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు దేశం అంతా వణికిపోతుంది. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 17,335 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసులు శుక్రవారం 15 శాతం పెరిగాయి. దేశ రాజధానిలో గత 24 గంటల్లో తొమ్మిది మంది మరణించారు. ఢిల్లీ యొక్క పాజిటివిటీ రేటు - ప్రతి 100 పరీక్షలకు పాజిటివ్ పరీక్షించే వ్యక్తుల సంఖ్య - కేసుల తాజా చేరికతో 17.73 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 97,762 పరీక్షలు నిర్వహించారు.నగరం గత వారం రోజులుగా కేసుల ఉప్పెనను చూస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా కరోనా కేసుల పెరుగుదల చోటు చేసుకుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ, భారతదేశంలో ఆధిపత్య వేరియంట్ గా మారుతోంది.
ఢిల్లీలో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించినా... ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. వీకెండ్ కర్ఫ్యూలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో, పోలీసులు వీకెండ్ కర్ఫ్యూలపై ప్రజల్ని అభిప్రాయాల్ని అడిగారు. ఈ విషయంలో తగు సూచనలు, ఏమైనా డౌట్స్ ఉంటే తమకు తెలపాలని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా కోరారు.
అయితే, ఢిల్లీ పోలీసులకు ఓ విచ్రితమైన ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ సార్.. మాస్కులు ధరించి.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్రికెట్ ఆడొచ్చా అని ప్రశ్న అడిగాడు ఓ నెటిజన్. దీనికి క్రికెట్ స్టైల్ లోనే సూపర్ సెటైర్ వేశారు ఢిల్లీ పోలీసులు. " ఇది సిల్లీ పాయింట్.. ఎక్స్ ట్రా కవర్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అంతేకాకుండా..ఢిల్లీ పోలీసులు క్యాచింగ్ చేయడంలో గుడ్ " అంటూ ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు.
Keeping #COVID19 in mind, Weekend Curfew shall be imposed in Delhi tomorrow onwards.
If you have any questions related to it, #DelhiPolice will answer them.
ఢిల్లీ పోలీసుల ఫన్నీ రిప్లై చూసిన మిగతా నెటిజన్లు వారి సమయస్పూర్తిని ప్రశంసిస్తున్నారు. సిల్లీ పాయింట్, ఎక్స్ ట్రా కవర్, క్యాచింగ్ అనేవి క్రికెట్ కు సంబంధించినవి. వీటితోనే ఢిల్లీ పోలీసులు అదరగొట్టారు. మీరు అడిగిన ప్రశ్న సిల్లీగా ఉందని.. దీనిపై ఎక్స్ ట్రా టైం తీసుకుంటామని.. తప్పు చేస్తే ఢిల్లీ పోలీసులు క్యాచ్ చేస్తారంటూ అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. మొత్తానికి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.
Can we play cricket with social distancing and mask...
ఏదేమైనా, ఢిల్లీలోని ఆసుపత్రులలో చేరిన రోగుల సంఖ్య జనవరి 1న 247 నుండి శుక్రవారం నాటికి 1,390కి పెరిగింది, ఇది వారంలో 462 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో వైద్య సదుపాయాల కల్పనపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30,000 యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ, కేవలం 24 మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని డేటా సూచిస్తోంది. ఢిల్లీ నివాసితులు కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తే మరియు కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తే, మహమ్మారి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు.
శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. వారంతపు కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కరోనా కేసుల ఉప్పెన కొనసాగుతున్నందున దేశ రాజధానిలో అనేక కోవిడ్ ఆంక్షలు విధించబడ్డాయి. ఎన్ని కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నా, ఎన్ని చర్యలు చేపడుతున్నా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో థర్డ్ వేవ్ వచ్చిందని స్పష్టం చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పదేపదే సూచిస్తున్నాయి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.