హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : వారెవ్వా..నడుమును బొంగరంలా తిప్పుతూ..బెల్లీ డ్యాన్స్ ఇరగదీసిన పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్..

Viral Video : వారెవ్వా..నడుమును బొంగరంలా తిప్పుతూ..బెల్లీ డ్యాన్స్ ఇరగదీసిన పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్..

Viral Video : వారెవ్వా..నడుమును బొంగరంలా తిప్పుతూ..బెల్లీ డ్యాన్స్ ఇరగదీసిన పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్..

Viral Video : వారెవ్వా..నడుమును బొంగరంలా తిప్పుతూ..బెల్లీ డ్యాన్స్ ఇరగదీసిన పృథ్వీ షా గర్ల్ ఫ్రెండ్..

Viral Video : ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ తరంగ్.. పృథ్వీషా, ప్రాచి సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా పృథ్వీ, ప్రాచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...

గ్రౌండ్ లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోవాల్సిన మన కుర్ర బ్యాట్స్ మెన్ గుండెల్లో ప్రేమ అలజడి మొదలైంది. ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన పృథ్వీ షా కూడా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ తరంగ్.. ప్రాచి సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా పృథ్వీ, ప్రాచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ అప్పుడప్పుడూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల్లో కామెంట్లు చేసుకుంటూ ఆ పుకార్లకు మరింత బలం చేకూరుస్తున్నారు. దీంతో ఈ యువ సెలబ్రిటీలు జంట పక్షులయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక, లేటెస్ట్ గా ప్రాచి సింగ్‌ బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెల్లీ డ్యాన్స్‌తో ప్రాచి తనలోని డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ను అభిమానులకు పరిచయం చేసింది. వెనకాల బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ వస్తుండగా.. ప్రాచి అద్భుతంగా డాన్స్ చేసింది. 'కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ మీకు ఉపశమనం కలిగించడానికి బెల్లీ డాన్స్ ట్రై చేశా. చూసి ఎలా ఉందో చెప్పండి' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వీడియో చూసిన ఫాన్స్ "సూపర్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక, పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో 6 బౌండరీలు బాదాడు. ఈ మ్యాచ్ లో 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. కోల్‌కతా మ్యాచ్‌లో పృథ్వీ షా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకున్నాడు.


మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు, సఫారీ సూపర్‌ స్టైకర్‌, , గేమ్‌ ఛేంజర్‌, క్రెడ్‌ పవర్‌ ప్లేయర్‌, అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ అసెట్‌ అవార్డులు షా గెలుచుకున్నాడు. దీంతో ప్రాచి సింగ్‌ తన ప్రేమను తెలుపుతూనే ఓ సెటైర్ వేసింది. తెషా అందుకున్న అవార్డులన్నింటినీ కలిపి ఒక ఫోటోలో జత చేసిన ప్రాచి.. "ఆ అవార్డులు అన్ని తీసుకెళ్లడానికి కొత్త సూట్‌ కేసు కావాలేమో" అని కామెంట్‌ చేశారు. ప్రాచి తరచూ తన వర్కవుట్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది.

First published:

Tags: Delhi Capitals, IPL 2021, Prithvi shaw

ఉత్తమ కథలు