IPL 2021- 1st Qualifier: గురుశిష్యుల పోరాటం.. తొలి క్వాలిఫయర్‌లోఢిల్లీతో చెన్నై ఢీ.. గెలుపెవరిది?

IPL 2021- 1st Qualifier: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. దాబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

 • News18 Telugu
 • | October 09, 2021, 22:03 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED 2 MONTHS AGO

  AUTO-REFRESH

  Highlights

  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్ చివరి దశకు చేరుకున్నది. శుక్రవారంతో లీగ్ దశలోని మ్యాచ్‌లన్నీ ముగిసిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bengaluru), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఆదివారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనున్నాయి. చెన్నై జట్టు అనుభవజ్ఞులతో నిండిపోయి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్లతో దూకుడు మీద ఉన్నది. ఒక విధంగా ఇది అనుభవానికి.. దూకుడికి మధ్య పోటీ అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. ఆ రెండు మ్యాచ్‌లలో ఢిల్లీనే గెలుపొందింది. గురు శిష్యులైన ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ మధ్య పోటీలో ఇప్పటి వరకు పంత్‌దే పై చేయి అయ్యింది.

  ఐపీఎల్ చరిత్రంలో 12 సీజన్లు ఆడిన చెన్నై జట్టు 11 సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నది. గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో సీఎస్కే అత్యం పేలవమైన ప్రదర్శన చేసి కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు. కానీ అనూహ్యంగా ఈ సీజన్‌లో జట్టు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకొని పోయింది. అయితే ప్లే ఆఫ్స్ ముందు వరుసగా మూడు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇక ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్ మంచి ఫామ్‌లో ఉన్నారు.

  Shikha Pandey: ఉమెన్ క్రికెట్‌లో శిఖా పాండే సంచలన బౌలింగ్.. బాల్ ఆఫ్ ది సెంచరీగా కీర్తించబడుతున్న ఆ వీడియో చూశారా?
  ఇక మిడిల్ ఆర్డర్‌లో అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా రాణిస్తున్నారు. అయితే ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా మాత్రమే సరైన పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో వికెట్లు తీస్తూ జట్టుకు సహకరిస్తున్నారు. గెలవడానికి అవసరమైన వ్యూహాలు రచించడంలో ధోనీని మించిన వాళ్లు లేరు. దీంతో అతడి అనుభవాన్నంతా ఉపయోగించి గెలుపు కోసం కృషి చేస్తాడనడంలో అతిశయోక్తి లేదు.

  Cristiano Ronaldo: మ్యాచ్ ముగియగానే రొనాల్డో ఆ బాత్ టబ్‌లోనే స్నానం చేస్తాడంటా.. దాని ఖరీదు, ప్రత్యేకతలు తెలుసా?
  కెప్టెన్ రిషబ్ పంత్‌తో సహా పలువురు క్రికెటర్లు అనుభవం తక్కువగా ఉన్నా.. కుర్రాళ్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలను మించి ఈ సీజన్‌లో రాణించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టునే ఈ సీజన్‌లో రెండు సార్లు ఓడించి పై చేయి సాధించింది. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో తొలి దశలో రిషబ్ పంత్ ఎంతో అనుభవం ఉన్న వాడిలా జట్టును నడిపించాడు. ఇక అయ్యర్ వచ్చినా కెప్టెన్‌గా కొనసాగుతూ జట్టుకు అందిస్తున్నా.. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఫామ్‌లోకి రావడం జట్టులో కొంత ఉత్సాహాన్ని తెచ్చింది. శిఖర్ ధావన్ మంచి టచ్‌లో ఉన్నాడు. కానీ తొలి దశలో రాణించిన పృథ్వీషా రెండో దశలో ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది.