సీరియల్స్‌లో (TV Serials) వచ్చే కొన్ని డైలాగులు పెద్దగా గుర్తింపునకు నోచుకోవు. కానీ అవి మీమ్స్ (Memes) రూపంలో వచ్చినప్పుడు వాటికి లభించే పాపులారిటీ అంతా ఇంతా ఉండదు. ప్రముఖులు చాలా మంది వాటిని అనుకరించేందుకు పోటీ పడుతుంటారు. ప్రముఖ హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ ప్లస్‌లో (Star Plus) వచ్చే సాథ్ నిబానా సాథియా అనే పాపులర్ హిందీ సీరియల్లో ఒక డైలాగ్ ఇప్పుడు నెటిజన్లను ఊపేస్తోంది. అందులోని డైలాగ్ ఆధారంగా రూపొందించిన మీమ్, ఇన్‌స్టా రీల్స్ కు 62 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు.. అది ఎంత వైరల్ అయిందో. అన్నట్టు ఆ మీమ్ వీడియోలో నటించింది ఎవరనుకుంటున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఆటగాళ్లు శిఖర్ ధావన్ (Shikhar Dhawan), పృధ్వీ షా (Pruthvi Shaw). సీరియల్ డైలాగ్‌కు లిప్ సింక్, డ్యాన్స్ చేస్తూ రూపొందిన ఈ మీమ్ నిజంగా ఒక హైలైట్.
ఐపీఎల్ (IPL 2021) రెండో దశ ప్రారంభం కావడంతో ఫీల్డ్‌లోనే కాదు ఆఫ్ ఫీల్డ్‌లోనూ వినోదపు డోస్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శిఖర్, పృధ్వీ నటించిన ఈ వీడియో అదరగొడుతోంది. చేతిలో ప్లేటుతో మణి పాత్రను పృధ్వీ పోషించగా, ఏం వండుతున్నావని ఇంటి పెద్ద కోకిలా బెన్ చెప్పే డైలాగులకు లిప్ సింక్ చేశాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఇద్దరు చేసే డ్యాన్స్ చూసి నవ్వని వాళ్లు ఉండరు.
View this post on Instagram
ఈ వీడియోను శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ రీల్ షేర్ చేశాడు. మణి, పోహే బనేంగే అన్నది ఇప్పుడు నెటిజన్లకు అత్యంత ఇష్టమైన డైలాగుగా మారిపోయింది. స్టార్ ప్లస్‌లో వచ్చే ‘సాథ్ నిబానా సాథియా’ సీరియల్లోని అనేక డైలాగులు గతేడాది కాలంగా మీమ్స్‌గా బాగా పాపులర్ అవుతున్నాయి. ‘రసోడే మే కౌన్ థా” అన్న డైలాగు చాలా రోజులు నెటిజన్లను అలరించింది. యష్‌రాజ్ ముఖాటే రూపొందించిన ఆ మీమ్ బాగా పాపులర్ అయింది.
Mithali Raj: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. మహిళా క్రికెట్లో మిథాలీ రికార్డుల మోత
ఇప్పుడు దాన్ని మించిన క్రేజ్‌తో వచ్చిన అటుకుల డైలాగ్ నిజంగా అదరగొడుతోంది. కామెంట్స్ కూడా విపరీతంగా వచ్చాయి ఈ మీమ్ వీడియోకు. పర్ఫామెన్స్తో అదరగొట్టారని కొందరు కామెంట్ చేస్తూ, ఇక మీరు రియల్ యాక్టింగ్ మొదలు పెట్టవచ్చని మరికొందరు సలహా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2021, Prithvi shaw, Shikhar Dhawan