Home /News /sports /

DELHI CAPITALS BEAT CHENNAI SUPER KINGS BY 3 WICKETS AND BECAME TABLE TOPPER JNK

CSK vs DC: ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. చెన్నైపై గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ

కీలక పోరులోచెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. పాయింట్స్ టేబుల్‌లోటాప్ (PC: IPL)

కీలక పోరులోచెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. పాయింట్స్ టేబుల్‌లోటాప్ (PC: IPL)

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకున్నది.

    అప్పటికే 6 కీలక వికెట్లు పడిపోవడంతో పాటు రిక్వైర్డ్ రన్‌రేట్ కూడా భారీగా ఉన్నది. నెమ్మదైన పిచ్‌పై బౌలర్లు చెలరేగుతున్న సమయంలో పరుగులు రావడం గగనమైంది. ఢిల్లీ లైనప్‌లో గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్ హిట్‌మెయర్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. మొదటి నుంచి చెన్నై బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ వేయడానికి డ్వేన్ బ్రావో వచ్చాడు. అతడికి ఈ మ్యాచ్‌లో అదే తొలి ఓవర్. అయినా సరే డెత్ వోవర్ స్పెషలిస్టు కాబట్టి ధోనీ అతడిని రంగంలోకి దించాడు. అనుకున్నట్లు గానే బ్రావో బంతిని తప్పుగా అంచనా వేసిన హిట్‌మెయర్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అది బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కృష్ణప్ప గౌతమ్ చేతిలో పడింది. కానీ ఆ క్యాచ్‌ను సరైన విధంగా జడ్జ్ చేయలేక వదిలేశాడు. అంతే గ్రౌండ్‌లో ఒక్కసారిగా సీఎస్కే అభిమానుల సందడి ఆగిపోయింది. అదే మ్యాచ్‌ను టర్న్ తిప్పింది.

    ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై జట్టు నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు సరైన ఆరంభం అందించలేదు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ పృథ్వి షా (18) దీపక్ చాహర్ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (2) హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం మరో ఎండ్‌లో స్టాండ్ అయ్యాడు. తన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా పరుగులు తీశాడు. కానీ వికెట్ పడకుండా కాపాడుకుంటూ చిన్న భాగస్వామ్యాల కోసం ప్రయత్నించాడు. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ (15), రిపల్ పటేల్ (18) పర్వాలేదనిపించినా.. రవిచంద్రన్ అశ్విన్ (2) నిరాశ పరిచాడు. దీంతో ధావన్ (39) ఒత్తడికి గురై వికెట్ పారేసుకున్నాడు. దీంతో మ్యాచ్ చెన్నయ్ వైపు తిరిగింది.





    కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ భారీగా పరుగులు రాకుండా అడ్డుకున్నారు. అయితే 18వ ఓవర్‌లో షిమ్రోన్ హెట్‌మేయర్ ఇచ్చిన క్యాచ్‌ను కృష్ణప్ప గౌతమ్ వదిలేశాడు. ఆ తర్వాత హెట్‌మెయర్ ధాటిగా ఆడుతూ రెండు బౌండరీలు, ఒక సిక్స్‌తో కేవలం 18 బంతుల్లో 28 పరగులు స్కోర్ చేశాడు. ఆ ఒక్క క్యాచ్ మిస్ కావడంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్ (5) అవుటైనా.. కాగిసో రబాడా ఒక బౌండరీ కొట్టి మరో రెండు బంతులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం ఛేదించింది. దీంతో ఢిల్లీకి 3 వికెట్ల విజయం లభించింది. అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Chennai Super Kings, Delhi Capitals, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు