DC vs RR: ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుకు రాజస్థాన్ బౌలర్ల కళ్లెం.. రాణించిన మిడిల్ ఆర్డర్.. టార్గెట్ ఎంతంటే?

రాజస్థాన్‌కు 155 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఢిల్లీ (PC: IPL)

ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు రాణించి బలమైన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయగలిగారు.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్లు జంటైన పృథ్వీషా (Pruthvi Shaw), శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తొలి సారి విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ రాణించినా.. చివర్లో రాజస్థాన్ (Rajasthan Royals) బౌలర్లు కట్టడి చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులకు పరిమితం అయ్యింది. అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (8) కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పృథ్వీ షా (10) చేతన్ సకారియా బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగులకే కీలకమైన ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

    కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. అయితే రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వేగంగా పరుగులు చేయలేకపోయారు. ముఖ్యంగా రిషబ్ పంత్ దూకుడును ప్రదర్శించలేకపోయాడు. వీరిద్దరూ కలసి మూడు వికెట్‌కు 62 పరుగులు జోడించారు రిషబ్ పంత్ (24) ముస్తఫిజుర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షిమ్రోన్ హెట్‌మెయర్ (28) కాస్త దూకుడుగా ఆడాడు. అయితే శ్రేయస్ అయ్యర్(43) రాహుల్ తెవాతియా బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల వేగం తగ్గపోయింది. హెట్‌మెయర్ ‘28) ముస్తఫిజుర్ బౌలింగ్‌లో చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. లలిత్ యాదవ్ (14), అక్షర్ పటేల్ (12) అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. ముస్తఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా తలా రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాతియా చెరో వికెట్ తీశారు.

    Team India: కోహ్లీసేనకు దొరికిన 'వరుణాస్త్రం'.. పొట్టి ప్రపంచకప్‌లో ప్రధాన అస్త్రంగా మారనున్న వరుణ్ చక్రవర్తి?









    రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం కోసం 155 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ టాప్ 4లోకి చేరే అవకాశం ఉన్నది. దీంతో వారికి ప్లేఆఫ్ ఆవకాశాలు మరింత మెరుగవుతాయి.
    Published by:John Naveen Kora
    First published: