మరికొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న ఒలంపిక్స్‌లో భారతీయ వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. మన దేశానికి చెందిన దీపిక్ కబ్రాకు ఒలంపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జడ్జిగా వ్యవహరించే అవకాశం వచ్చింది. దీపిక్‌కు ఈ అవకాశం రావడం పట్ల దేశానికి చెందిన ప్రముఖ జమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం దక్కించుకున్న దీపిక్‌కు ట్విట్టర్ వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. దీపిక్ తరహాలోనే జాతీయ రైఫల్ సమాఖ్య జాయింట్ సెక్రటరీ పవన్ సింగ్ ఒలంపిక్స్‌కు ఎంపికైన తొలి జూరర్‌గా అవకాశం దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే ఒలంపిక్స్ క్రీడల్లో దేశం తరపున జిమ్నాస్టిక్స్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల ప్రణతి నాయక్ మాత్రమే పాల్గొంటున్నారు. ఆమె 2019లో జరిగిన ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. జపాన్‌లోని టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్ ఈ నెల 23న మొదలుకానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tokyo Olympics