• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • DC WON BY 7 WICKETS ON PBKS DHAWAN SITUATIONAL INNINGS MAYANK AGARWAL CAPTAINCY INNINGS GONE WASTE JNK

IPL2021 : PBKS vs DC పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ విజయం.. శిఖర్ ధావన్ అద్భుత బ్యాటింగ్.. మయాంక్ పరుగులు వృధా

పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం [PC: iplt20.com]

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings)జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 167 పరుగుల టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ శుభారంభాన్ని అందించారు. పృథ్వీ షా గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించాడు. బౌండరీలు, సిక్సులు కొడుతూ ఢిల్లీ స్కోర్ కార్డును పరుగులెత్తించాడు. పృథ్వీ షా 22 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్‌తో కలసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించిన తర్వాత హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో వైపు శిఖర్ ధావన్ ఆచి తూచి ఆడాడు. ధావన్, స్టీవ్ స్మిత్ కలసి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. స్మిత్ (25) రిలే మెరిడిత్ బౌలింగ్‌లో డేవిడ్ మలన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కానీ మొదట్లో నెమ్మదిగా ఆడిన శిఖర్ ధావన్ మాత్రం దూకుడు పెంచాడు. కావల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో తన దైన శైలిలో రెచ్చిపోయాడు. అతడికి చివర్లో రిషబ్ పంత్ (14), హెట్ మెయర్ కలసిశారు. ధావన్ 47 బంతుల్లో 2 సిక్సులు 6 బౌండరీలతో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెట్ మెయర్ చివర్లో రెండు సిక్సులు కొట్టి లక్ష్యాన్ని తక్కువ బంతుల్లో పూర్తయ్యేలా ప్రయత్నించాడు. రిలే మెరిడిత్ చివర్లో రెండు వైడ్లు వేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నది. రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్ తలా ఒక వికెట్ తీశారు.





    ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్ 2021లో శిఖర్ ధావన్ 380 పరుగులతో అగ్రస్థానానికి చేరుకొని ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. మరోవైపు కేఎల్ రాహుల్ లేని లోటు పంజాబ్ కింగ్స్ జట్టులో స్పష్టంగా తెలిసింది. అనుభవజ్ఞుడైన కెప్టెన్ ఉండి ఉంటే ఏ సమయంలో ఏ బౌలర్‌ను తీసుకొని రావాలో అనే దానిపై స్పష్టం ఉండేది. అయితే కెప్టెన్సీ భారం పడినా మయాంక్ అగర్వాల్ బ్యాటుతో రాణించడం పంజాబ్ కింగ్స్ నుంచి పాజిటివ్ సైన్ అనుకోవచ్చు.
    Published by:John Naveen Kora
    First published: