DC vs RR: రాజస్థాన్‌పై ఢిల్లీ ప్రతీకారం తీర్చుకునేనా? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం

టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న రాజస్థాన్ రాయల్స్ (PC: IPL)

ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతున్నది. తొలి దశ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపొందగా.. ఇప్పుడు ఆ మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశలో భాగంగా అబుదాబిలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) - రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నది. సంజూ శాంసన్ (Sanju Samson) కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో దశను అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. పంజాబ్ కింగ్స్ పటిష్ట స్థితిలో ఉన్నప్పుడు రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. ముఖ్యంగా ముస్తఫిజుర్, కార్తీక్ త్యాగీ చివరి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన రాజస్థాన్ జట్టుకు రెండు పరుగల తేడాతో విజయాన్ని అందించారు. ఓపెనర్ ఎవిన్ లూయీస్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారిద్దరి బదులు తబ్రిజ్ శంషి, డేవిడ్ మిల్లర్ తుది జట్టులోకి వచ్చారు. 'మేం బౌలింగ్ చేయాలని భావిస్తున్నాం. ఎందుకంటే ఇది రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనపడుతున్నది. మా దగ్గర మంచి బ్యాట్స్‌మాన్ కూడా ఉన్నారు కాబట్టి ఛేజింగ్ ఈజీగా ఉంటుందనుకుంటున్నాను' అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ తర్వాత వ్యాఖ్యానించాడు.

    గత సీజన్ లానే ఈ సారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకొని పోతున్నది. పాయింట్స్ టేబుల్‌లో చెన్నై తర్వాతి స్థానంలో ఉన్న రిషబ్ పంత్ (Rishabh Pant) నేతృత్వంలోని ఢిల్లీ జట్టు వరుసగా మూడు విజయాలతో ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నది. ఢిల్లీ జట్టు గత మ్యాచ్‌లో నుంచి ఒక మార్పు చేసింది. మార్కస్ స్టోయినిస్ బదులుగా లలిత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగు పడే అవకాశం ఉన్నది. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం ముగ్గురు విదేశీ క్రికెటర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతుండటం విశేషం. తుది జట్లు ఇలా ఉన్నాయి.









    ఇరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లలో తలపడగా.. రాజస్థాన్ జట్టు 12 మ్యాచ్‌లు ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌లు గెలిచింది. ఇండియాలో జరిగిన తొలి దశ ఐపీఎల్‌లో ఇరు జట్లు ముంబై వేదికగా మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలవడం గమనార్హం.
    Published by:John Naveen Kora
    First published: