DC vs RR: రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ ఘనవిజయం.. చేతులెత్తేసిన రాయల్స్ బ్యాట్స్‌మెన్.. ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరినట్లే

రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం(PC: IPL)

DC vs RR: రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది, బ్యాటింగ్‌లో తడబడినా.. ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) దుమ్ము రేపింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడినా.. బౌలర్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తొలి ఓవర్ నుంచే వికెట్లు తీసి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ లియామ్ లివింగ్ స్టోన్ (1) అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు (Rishabh Pant) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ వెంటనే యశస్వి జైస్వాల్ (5) ఎన్రిక్ నోర్జే బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాణిస్తాడని భావించిన హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (7) రవిచంద్రన్ అశ్వన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

    ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మాత్రం క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. కానీ అతడికి తోడుగా సరైన సహకారం లభించలేదు. మహిపాల్ లామ్రోర్ (19) ఒక్కడే కాసేపు సంజూ శాంసన్‌కు కాసేపు తోడుగా నిలిచాడు. చివరకు లామ్రోర్.. రబాడా బౌలింగ్‌లో అవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత ఒక్కరు కూడా బ్యాటుతో రాణించలేకపోయారు. సంజూ శాంసన్ ఒక్కడే (70) అర్ద సెంచరీ చేసి చివరి వరకు పోరాడాడు. కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన అర్ద సెంచరీ వృధాగా మారింది. అతడే కనుక క్రీజులో లేకుండటే రాయల్స్ జట్టు 100 పరుగుల మార్కైనా దాటేది అనుమానమే. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 33 పరుగగుల తేడాతో విజయం సాధించింది.

    Team India: కోహ్లీసేనకు దొరికిన 'వరుణాస్త్రం'.. పొట్టి ప్రపంచకప్‌లో ప్రధాన అస్త్రంగా మారనున్న వరుణ్ చక్రవర్తి?









    ఢిల్లీ జట్టు ఓపెనర్లు విఫలమైనా క్రీజులో నిలబడి పోరాడిన శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్లు 16కు చేరింది. దీంతో ఢిల్లీ దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నట్లే. అయితే అధికారికంగా మాత్రం ఇంక ప్రకటించలేదు.
    Published by:John Naveen Kora
    First published: