IPL 2021 : ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌లో రికార్డులు తెలుసా? ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో ఎన్నిసార్లు డకౌట్ అయ్యాడంటే..

IPL 2021 : DC Vs CSK రికార్డులు ఇవే [PC: IPL@twitter]

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021_ భాగంగా శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు మరో 10 బంతులు ఉండగానే అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు పృథ్విషా, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు 138 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో ఢిల్లీ సునాయాసం విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఏయే రికార్డులు (Match Records) నెలకొల్పారో ఒక సారి చూద్దాం. చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగల ఛేదనలో ఇది మూడో స్థానంలో ఉన్నది. గతంలో 2014లో అబుదాబిలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) 206 పరుగులను ఛేదించింది. ఇదే టాప్ చేజింగ్. ఇక రెండో స్థానంలో 2012లో చెన్నైలోని చేపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 191 పరుగులను ఛేదించింది. మూడో స్థానంలో శనివారం జరిగిన మ్యాచ్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత 2011లో మొహలీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, 2009 సెంచూరియన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 189 పరుగులు ఛేదించి చెన్నైపై రికార్డు సృష్టించాయి.

    ఇక చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు సీఎస్కేపై ధావన్ 909 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (901), రోహిత్ శర్మ (749), డేవిడ్ వార్నర్ (617), ఏబీ డివిలియర్స్ (593), రాబిన్ ఊతప్ప (590) ఉన్నారు. మరోవైపు అత్యధిక భాగస్వాయ్యం రికార్డు కూడా చెన్నైపై ఢిల్లీ ఆటగాళ్లు నెలకొల్పారు. గతంలో 2015లో అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజింక్య రహానే, షేన్ వాట్సన్ కలసి 144 పరుగులు జోడించారు. చెన్నైపై ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఆ తర్వాత నిన్నటి మ్యాచ్‌లో పృథ్విషా, శిఖర్ ధావన్ జోడి 138 పరుగులు జోడించింది. దీని తర్వాత స్థానంలో బిస్లా, కల్లిస్ జోడి 2012లో చెన్నైలోనే 136 పరుగుల భాగస్వామ్యం అందించింది.





    ఇక ధోనీ ఐపీఎల్ కెరీర్‌లో డకౌట్ కావడం ఇది నాలుగో సారి. ఢిల్లీపై జరిగిన మ్యాచ్‌లో డక్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు 2010లో చెన్నైలో రాజస్థాన్ రాయల్స్‌పై, 2010లో చెన్నైలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై, 2015లో ముంబై ఇండియన్స్‌పై తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై డకౌట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ కేవలం ఒకే వికెట్ తీసి 47 పరుగులు ఇచ్చాడు. ఇది ఐపీఎల్ కెరీర్‌లో అతడికి రెండో అత్యధికం. అంతకు ముందు 2018లో పంజాబ్ తరపున ఆడిన సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published: