• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • DC ALL ROUNDER AXAR PATEL TAKEN OWN DECISSION TO BOWL SUPER OVER JNK

IPL 2021: అక్షర్ సూపర్ ఓవర్ వేయాలనే నిర్ణయం పంత్, రికీ పాంటింగ్‌ది కాదట.. మరి ఎవరు వేయమన్నారు?

IPL 2021: అక్షర్ సూపర్ ఓవర్ వేయాలనే నిర్ణయం పంత్, రికీ పాంటింగ్‌ది కాదట.. మరి ఎవరు వేయమన్నారు?

సూపర్ ఓవర్ అక్షర్‌తో వేయించాలనే నిర్ణయం ఎవరిదంటే..

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగియగా సూపర్ ఓవర్ (Super Over) ద్వారా ఫలితం తేల్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రంలో తొలి సారి ఇద్దరు స్పిన్నర్లు సూపర్ ఓవర్‌లో బంతులు విసిరారు. తొలి సూపర్ ఓవర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) వేశాడు. స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించడంపై అందరూ అశ్చర్యపోయారు. అయితే అక్షర్‌తో బౌలింగ్ చేయించాలని కెప్టెన్ పంత్ గానీ, కోచ్ రికీ పాంటింగ్ గానీ అనుకోలేదట. ఆ నిర్ణయం స్వయంగా అక్షర్ పటేల్ తీసుకున్నాడట. ఈ విషయాన్ని అక్షర్ మ్యాచ్ అనంతరం ఆవేశ్ ఖాన్‌తో చేసిన చిట్ చాట్‌లో చెప్పుకొచ్చాడు. సూపర్ ఓవర్ ఓవరు వేయాలనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో అక్షర్ వారి వద్దకు వెళ్లి ఆ ఓవర్ తాను వేస్తానని చెప్పాడు. అక్షర్ నిర్ణయం విని తొలుత పంత్, రికీ ఆశ్చర్య పోయారట. కానీ వారిద్దరినీ తన మాటలతో కన్విన్స్ చేశాడు.

    కోచ్ పాంటింగ్, కెప్టెన్ రిషబ్ పంత్ మొదటి ఆవేశ్ ఖాన్‌తో బౌలింగ్ చేయించాలనుకున్నారు. అయితే వారి వద్దకు వెళ్లి.. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నది. సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. లెఫ్టాండర్ అయిన వార్నర్‌ను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టవచ్చు అని కన్విన్స్ చేశాను. నేను సూపర్ ఓవర్ వేస్తాను అని చెప్పాను. దీంతో వారిద్దరూ నా మాటలతో సరే అని చెప్పారు. అందుకే వెంటనే బంతిని అందుకొని బరిలోకి దిగాను. మొదట ఇద్దరూ భయపడ్డారు. స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్లు కొడతారేమో అని. కానీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవల 7 పరుగులకే పరిమితం అయ్యారు. ఆ ఓవర్ ముగిసిన తర్వాత ఇద్దరూ నన్ను అభినందించారని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.





    కాగా, కేన్ విలియమ్‌సన్ వీరోచిత పోరాటంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌లో కూడా అతడే ఒక బౌండరీ కొట్టాడు. లేకపోతే హైదరాబాద్ కనీసం ఆ ఏడు పరుగులు కూడా చేసేది కాదు. అయితే అక్షర్ ధైర్యంగా ముందుకు వచ్చి సూపర్ ఓవర్ వేయడం నిజంగా అభినందించ దగిన విషయమే. అక్షర్ వేసిన ఓవర్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో హైదరాబాద్ జట్టు కూడా స్పిన్నర్‌ను బరిలోకి దింపింది. రషీద్ ఖాన్ చేత బంతులు వేయించి ఒత్తిడి పెంచింది. అక్షర్ లాగే రషీద్ కూడా ప్రభావం చూపించాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మాన్ చీకీ సింగిల్స్ తీసి మ్యాచ్ గెలిచారు.
    Published by:John Naveen Kora
    First published: