చిన్నారికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ అవార్డ్ ఇచ్చేసిన డేవిడ్ వార్నర్

కేవలం 116 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు వార్నర్. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం అవార్డుతో వెళ్తున్న వార్నర్ .. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారిని సర్ ప్రైజ్ చేశాడు.

news18-telugu
Updated: June 14, 2019, 12:06 PM IST
చిన్నారికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ అవార్డ్ ఇచ్చేసిన డేవిడ్ వార్నర్
కేవలం 116 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు వార్నర్. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం అవార్డుతో వెళ్తున్న వార్నర్ .. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారిని సర్ ప్రైజ్ చేశాడు.
  • Share this:
తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ సత్తా చాటారు. ఫించ్ 82 రన్స్ చేసి అవుట్ అవ్వగా...ఆ సమయానికి హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. ఆ తర్వాత మాత్రం సెంచరీతో చెలరేగిపోయాడు. ఆసీస్ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. కేవలం 116 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు వార్నర్. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం అవార్డుతో వెళ్తున్న వార్నర్ .. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారిని సర్ ప్రైజ్ చేశాడు. తనకొచ్చిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’అవార్డును ఆ చిన్నారి అభిమానికి బహుమతిగా ఇచ్చేశాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.

చిన్నారి అభిమానికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ అవార్డ్ ఇచ్చేసిన డేవిడ్ వార్నర్


దీంతో అనుకోకుండా ఒక్కసారిగా తనకు అందిన వార్నర్ బహుమతిని చూసి చిన్నారి ఎంతో సంతోషించాడు. ‘మేం ఇక్కడ నిల్చొని ఆసీస్‌ జెండా ఊపుతున్నాం. వార్నర్‌ మా దగ్గరికి వచ్చి తనే స్వయంగా ఆ అవార్డు ఇచ్చాడు’ అంటూ ఆ బుడతడు ఎంతో సంబరపడిపోయాడు. వార్నర్‌ అంటే తనకెంతో ఇష్టమన్నాడు. ఇలా ప్రతీ మ్యాచ్‌లో కూడా వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవాలని కోరుకున్నాడు.

బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్‌తో పాటు వార్న‌ర్ కూడా ఏడాది కాలం పాటు ఆసీస్ జ‌ట్టుకు దూరం అయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధం ముగిసిన త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్‌ 12వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే ఆటగాడికిచ్చే ఆరెంజ్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు. తాజాగా బుధవారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేల్లో వార్నర్‌కి ఇది 15వ సెంచరీ. ఈ క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 15 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ చోటు దక్కించుకున్నాడు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading