DAVID WARNER SHARES MORPHED VIDEO AS SARKAR VIJAY GOES VIRAL SRD
David Warner : వార్నీ.. వార్నరూ.. ఇరగదీశావ్ కదయ్యా.. దళపతి విజయ్ ను దింపేశావ్ గా..
Photo Credit : Instagram
David Warner : సోషల్ మీడియాలో ఈ క్రికెటర్ ఉన్నంత బిజీగా మరెవరూ ఉండరంటే..నిజమని ఒప్పుకోక తప్పుదు. ఆ క్రికెటర్ ఎవరనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.
సోషల్ మీడియాలో ఈ క్రికెటర్ ఉన్నంత బిజీగా మరెవరూ ఉండరంటే..నిజమని ఒప్పుకోక తప్పుదు. ఆ క్రికెటర్ ఎవరనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ దిగ్గజ క్రికెటర్ ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి మన ఇండియన్ సినిమాలపై మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా, మన దక్షిణాది సినిమాలన్నా, హీరోలన్నా వార్నర్ ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఇష్టపడటమే కాదండోయ్..వారు నటించిన సినిమాల్లోని పాటలకు డాన్సులు వేయడం, డైలాగ్స్‌ను చెప్పడం వంటి పనులు చేసి ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సదరు హీరోల అభిమానులను అలరిస్తుంటాడు వార్నర్. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. బుట్టబొమ్మ సాంగ్‌లో భార్యతో వార్నర్ వేసిన స్టెప్పులేయడం, బాహుబలిలో ప్రభాస్ డైలాగ్‌ను చెబుతూ వీడియోలు చేయడం, అలాగే పేస్ ఆఫ్ యాప్‌ను ఉపయోగించి సౌత్స్టార్స్ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో సదరు హీరోల స్థానంలో రీ ఫేస్ యాప్ ద్వారా తన ఫేస్‌ను అతికించి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.
మహేశ్ హీరోగా చేసి మహర్షి సినిమాలో కొన్ని సన్నివేశాలను చేయడం అలాగే, మరో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఫేస్ ఆఫ్ చేసి వీడియో పోస్ట్ చేశాడు మెప్పించాడు వార్నర్. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య టీజర్‌ను రీఫేస్ యాప్‌లో చేంజ్ చేసిన డేవిడ్ వార్నర్. ఆ తర్వాత మహేష్ బాబు పాల పిట్ట సాంగ్ లో మరో సారి మెరిశాడు.
ఇప్పుడు లేటెస్ట్ గా వార్నర్ దళపతి విజయ్ మూవీ సర్కార్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. విజయ్ ఎక్స్ ప్రేషన్స్ కు తగ్గట్టుగా వార్నర్ యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.