David Warner: ప్రభాస్ పాత్రలో డేవిడ్ వార్నర్.. వీడియో మాములుగా లేదుగా

డేవిడ్ వార్నర్(David Warner)(ఫైల్ ఫొటో)

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌లో(TikTok) పలు పాటలకు చిందులేయడమే కాకుండా, డైలాగ్‌లు డబ్‌స్మాష్‌లు చేశాడు.

  • Share this:
    ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌లో(TikTok) పలు పాటలకు చిందులేయడమే కాకుండా, డైలాగ్‌లు డబ్‌స్మాష్‌లు చేశాడు. వార్నర్ ఒక్కడు మాత్రమే కాదు.. అతడి కుటుంబసభ్యులు కూడా పలు వీడియోల్లో సందడి చేశారు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిద్యం వహిస్తున్న వార్నర్.. ఇక్కడివారికి బాగా తెలిసిన వ్యక్తిగా మారిపోయాడు. వార్నర్ కూడా భారత్ తనకు రెండో ఇల్లు అని పలు సందర్బాల్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇక్కడి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పలు తెలుగు హిట్ సాంగ్స్‌కు వార్నర్ చిందులేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాహుబలి చిత్రంలోని ఓ ఫైట్ సీన్‌ను మార్ఫ్ చేసిన రెండు వీడియోలను వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ వీడియోలో బాహుబలి చిత్రంలోని ఓ ఫైట్ సీన్‌లో ప్రభాస్(బాహుబలి) ఫేస్‌ను మార్ఫ్ చేసి వార్నర్ ఫేస్‌ను ఉంచారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. జై బాహుబలి అని, జై వార్నర్‌బలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక, కొద్ది రోజుల కిందట షారుఖ్ ఖాన్‌ చిత్రానికి సంబంధించి కూడా ఇలాంటి ఓ వీడియోనే వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.











    మరోవైపు వార్నర్ ఇండియాతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌ కోసం వార్నర్ సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియ, ఇండియాలు మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌ను ఆసీస్ సొంతం చేసుకోగా, టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
    Published by:Sumanth Kanukula
    First published: