సోషల్ మీడియాలో ఈ క్రికెటర్ (Cricketer) ఉన్నంత బిజీగా మరెవరూ ఉండరంటే..నిజమని ఒప్పుకోక తప్పుదు. ఆ క్రికెటర్ ఎవరనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner). ఈ దిగ్గజ క్రికెటర్ ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి మన ఇండియన్ సినిమాలపై మక్కువ పెంచుకున్నాడు. భారత్(India)ను తన రెండో ఇళ్లుగా పరిగణించే వార్నర్.. హైదరాబాద్ (Hyderabad) తన సొంతగడ్డగా ఫీలవుతాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ చెబుతూ.. సాంగ్స్‌కు చిందేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.
మన దక్షిణాది సినిమాలన్నా, హీరోలన్నా వార్నర్ ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఇష్టపడటమే కాదండోయ్..వారు నటించిన సినిమాల్లోని పాటలకు డాన్సులు వేయడం, డైలాగ్స్‌ను చెప్పడం వంటి పనులు చేసి ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సదరు హీరోల అభిమానులను అలరిస్తుంటాడు వార్నర్.
ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. బుట్టబొమ్మ సాంగ్‌లో భార్యతో వార్నర్ వేసిన స్టెప్పులేయడం, బాహుబలిలో ప్రభాస్ డైలాగ్‌ను చెబుతూ వీడియోలు చేయడం, అలాగే పేస్ ఆఫ్ యాప్‌ను ఉపయోగించి సౌత్స్టార్స్ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో సదరు హీరోల స్థానంలో రీ ఫేస్ యాప్ ద్వారా తన ఫేస్‌ను అతికించి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు.తెలుగు, తమిళ్, హింది అన్న తేడా లేకుండా.. వీడియోలతో ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తుంటాడు వార్నర్.
View this post on Instagram
ఇక, తాజాగా భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. విచిత్రం ఏంటంటే ఎప్పుడూ హీరోల ముఖాలకు తన ఫేస్ పెట్టి స్పూఫ్ చేసే వార్నర్.. ఈ సారి రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలో 'వాటే బ్యూటీ'పాటలోని.. 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు' అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ఇక, ఈ వీడియో చేసినందుకు రష్మిక మందన్నకి సారీ (ఫన్నీగా) అంటూ కామెంట్ కూడా చేశాడు.
ఈ వీడియోపై నెటిజన్లు కూడా రకరకాల క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇక, టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ కూడా ఫన్నీ కామెంట్ చేశాడు. ఇంతకుముందు ఇంత బెటర్ గా కన్పించలేదు అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ చాలా దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన అతను కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, David Warner, Rashmika mandanna, Tollywood news