జోఫ్రా ఆర్చర్ దెబ్బకు వార్నర్ విలవిల.. దేవున్ని వేడుకున్న స్టార్ బాట్స్‌మెన్

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భయపెట్టాడు. పదునెక్కిన బౌన్సర్లను విసిరి మూడు బంతులకే వార్నర్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ను పంపారు.


Updated: September 7, 2020, 5:29 PM IST
జోఫ్రా ఆర్చర్ దెబ్బకు వార్నర్ విలవిల.. దేవున్ని వేడుకున్న స్టార్ బాట్స్‌మెన్
warnner
  • Share this:


ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భయపెట్టాడు. పదునెక్కిన బౌన్సర్లను విసిరి మూడు బంతులకే వార్నర్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ను పంపారు. ఆర్చర్ వేసిన ఆ మూడు బంతులను ఎదుర్కొవడంలో వార్నర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక అతను ఔటైనా బంతిని చూస్తే మాత్రం అతను బెంబేలెత్తిపోయాడో అర్ధమవుతుంది.

ఆర్చర్ వేసిన మూడో బంతి వేగంతో వార్నర్‌పైకి దూసుకొచ్చింది. దాన్ని ఆడడంలో అతను ఇబ్బందిపడ్డాడు. బంతి భుజాం కింది వైపు తాకుతూ.. బట్లర్ చేతిలో పడింది. దాని వేగానికి అదిరిపోయిన వార్నర్ 'ఓ జీసస్' అంటూ గట్టిగా అరిచాడు. ఈ మాటలు స్టంప్ మైక్స్‌లో రికార్డు అయ్యాయి. ఎంపైర్ అవుట్‌గా ప్రకటించగా దానిపై వార్నర్ రివ్యూ వెళ్ళగా భంగపాటే ఎదురైంది. గ్లౌవ్స్‌ను తకూతు బంతి కీపర్ చేతిలో పడింది. ఇది టీవీ రిప్లేలో స్పష్టంగా కనపడుతుంది. దీంతో వార్నర్ మైదానాన్ని వీడక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), స్టొయినిస్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 35) చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. అనంతరం ఛేధనకు దిగిన ఇంగ్లాండ్ ఇంగ్లండ్‌ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టీ20 సీరీస్‌ను కైవసం చేసుకుంది.
Published by: Rekulapally Saichand
First published: September 7, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading