India vs Australia: ఆసీస్‌కు గట్టి షాక్.. మిగితా మ్యాచ్‌లకు కీలక బాట్స్‌మెన్ దూరం

ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా టోర్ని నుంచి వైదొలిగాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు.

news18-telugu
Updated: November 30, 2020, 11:10 AM IST
India vs Australia: ఆసీస్‌కు గట్టి షాక్.. మిగితా మ్యాచ్‌లకు కీలక బాట్స్‌మెన్ దూరం
david warner
  • Share this:


ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా టోర్ని నుంచి వైదొలిగాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. అయితే అతని గాయం ఎంత తీవ్రమైందో తెలియదు. కానీ ఆ ఇంజూరీ కారణంగా అతను తదుపరి మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆడిన షాట్‌ను ఆపబోయిన డేవిడ్ వార్నర్ స్లిప్ అయి కింద పడిపోయాడు. దీంతో అతనికి తొడ కండరాలు పట్టేయడంతో వెంటనే మైదానం వీడాడు. అది తీవ్రమైన నొప్పిగా మారడంతో స్టేడియం నుంచి హాస్పిటల్‌లో చేర్చారు.

ఇక డేవిడ్ వార్నర్‌కు గ్రోయిన్ ఇంజ్యూరీ అయిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. రిపోర్ట్‌ల కోసం ఎదురుచూస్తున్నమని వెల్లడించింది. స్కానింగ్ రిపోర్ట్స్‌లో సానుకూలమైన ఫలితమే వస్తుందని ఆశిస్తున్నామని వివరించింది. ఇక గ్రోయిన్ స్ట్రెయిన్ గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని కామెంటేటర్ గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. ఈ గాయం కనకు తీవ్రమైతే వార్నర్ టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

మూడు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలవడంతో.. సిరీస్ ఆసీస్ వశమైంది. ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్‌పై 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టు 50 ఓవర్లలో.. 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది భారత జట్టు. ఈ వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా డిసెంబరు 2న జరగనుంది. ఆసీస్ ఇప్పటికే సిరీస్ గెలిచినందున.. అది కేవలం నామమాత్రపు మ్యాచ్‌గానే ఉండబోతోంది. అనంతరం డిసెంబరు 4 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.
Published by: Rekulapally Saichand
First published: November 30, 2020, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading