ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. క్రికెట్ లేకపోవడం వలన ఇంటికి పరిమితమైన వార్నర్ తన భార్య, పిల్లలతో కలిసి డ్యాన్స్‌లు చేయడం, పాపులర్ సినిమా డైలాగులకు తనదైన స్టైల్లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం వంటివి చేస్తూ నెటిజన్స్‌ని ఎంతగానో అలరించాడు.తెలుగు సినిమా పాటలు, డైలాగులతో పలువురు టాలీవుడ్ టాప్ హీరోల అనుకరణ వీడియోలు రూపొందించాడు. నిన్న మహేష్ బాబు వీడియోతో అలరించిన వార్నర్..లేటెస్ట్ గా తలైవా రజనీ గా మెస్మరైజ్ చేశాడు. రజనీ వీడియో చేయమని చాలా మంది అడిగారు. ఫైనల్ కి న్యూ ఇయర్ రోజున అంటూ పోస్ట్ చేశాడు వార్నర్.
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పటి నుండి వార్నర్‌కు తెలుగు ప్రేక్షకులు, ఇక్కడి సినిమాలతో మంచి బాండింగ్ ఏర్పడింది. వార్నర్ చాలా తెలుగు సినిమాలకు టిక్‌టాక్ వీడియోలు చేశాడు. తాజాగా వార్నర్ తలైవా రజనీ కాంత్ నటించిన దర్బార్ సినిమా నుంచి రీఫేస్ యాప్ తో కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో రజనీ ఫేస్‌కు బదులు తన ఫొటోని యాడ్ చేసి సరికొత్త వీడియో షేర్ చేశాడు వార్నర్. ప్రస్తుతం వార్నర్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నిన్ననే మహేష్ బాబు మహర్షి మూవీతో అలరించాడు డేవిడ్ వార్నర్. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోవడంతో అభిమానులు లైకులు కొడుతున్నారు.గాయంతో బాధపడుతున్న వార్నర్ ఫస్ట్ రెండు టెస్ట్ లకు దూరమయ్యాడు. అయితే, సిడ్నీ టెస్ట్ కి వార్నర్ ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నాడు.
Published by:Sridhar Reddy
First published:January 01, 2021, 15:03 IST