• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • DAVID WARNER COMES AGAIN WITH NEW AVATAR SALMAN KHAN TO ENTERTAIN FANS VIDEO GOES VIRAL SRD

David Warner: వార్నీ.. వార్నరూ.. సల్మాన్ ఖాన్ ను కూడా వదిలిపెట్టలేదుగా..

David Warner: వార్నీ.. వార్నరూ.. సల్మాన్ ఖాన్ ను కూడా వదిలిపెట్టలేదుగా..

Photo Credit : Instagram

David Warner: ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్... తాజాగా రూట్ మార్చాడు.

  • Share this:
    ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్... తాజాగా రూట్ మార్చాడు. అతనిప్పుడు మార్ఫ్డ్ ఫేస్ యాప్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ల లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. డైలాగులు ఇరగదీస్తున్నాడు. ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ కమెడీయన్ మిస్టర్ బీన్ పాత్రల్లో కనిపించి ఔరా అనిపించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా వదిలిపెట్టలేదు ఆస్ట్రేలియన్ చిచ్చర పిడుగు. సల్మాన్ ఖాన్ ఎక్స్ ప్రేషన్స్ కు తగ్గట్టుగా తనదైన స్టైల్స్ లో ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చి వారెవ్వా అన్పించాడు వార్నర్. సల్మాన్ ఖాన్ వీడియో చేయడం చాలా కష్టమని కూడా క్యాప్షన్ ఇచ్చాడు వార్నర్.ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది. సల్మాన్ అభిమానులు వార్నర్ భాయ్.. వార్నర్ భాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా చేసిన ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు.









    క్రికెట్ లేక‌పోవ‌డం వ‌ల‌న ఇంటికి ప‌రిమిత‌మైన వార్న‌ర్ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి డ్యాన్స్‌లు చేయ‌డం, పాపుల‌ర్ సినిమా డైలాగుల‌కు త‌న‌దైన స్టైల్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం వంటివి చేస్తూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించాడు.తెలుగు సినిమా పాటలు, డైలాగులతో పలువురు టాలీవుడ్‌ టాప్‌ హీరోల అనుకరణ వీడియోలు రూపొందించాడు. హైదరాబాద్ లోనే గాక.. వార్నర్ కు భారత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బుట్టబొమ్మ వీడియోతో పాటు.. లాక్డౌన్ టైం లో పలు భారతీయ సినిమాల పాటలకు అతడు చేసిన నృత్యం హైలైట్ గా నిలిచింది. వార్నర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయ్. ముఖ్యంగా హైదరాబాదీ అభిమానులైతే వార్నర్ నటనా కౌశల్యానికి మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: