హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : " రెస్పెక్ట్ " అంటూ అప్పును గుర్తు చేసిన డేవిడ్ బాయ్.. ఆర్సీబీకీ ఆడటం ఖాయమేనా..?

Viral Video : " రెస్పెక్ట్ " అంటూ అప్పును గుర్తు చేసిన డేవిడ్ బాయ్.. ఆర్సీబీకీ ఆడటం ఖాయమేనా..?

David Warner - APPU

David Warner - APPU

Viral Video : డేవిడ్ వార్నర్ గతేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా చేసిన ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు.

ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్... తాజాగా రూట్ మార్చాడు. అతనిప్పుడు మార్ఫ్డ్ ఫేస్ యాప్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ల లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. డైలాగులు ఇరగదీస్తున్నాడు. సన్ రైజర్స్ జట్టులో (SunRisers Hyderabad) ఉన్నప్పుడు తెలుగు హీరోల డైలాగులు, సాంగ్స్ తో రెచ్చిపోయిన డేవిడ్ బాయ్.. ఇప్పుడు కన్నడ హీరో వీడియో చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మరణించిన కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) ను గుర్తుచేస్తూ.. తన సినిమాలోని సీన్‌ను ఫేస్‌యాప్‌ సాయంతో రీక్రియేట్‌ చేసి రీల్‌ షేర్‌ చేశాడు. ‘‘రెస్పెక్ట్‌’’ అన్న హ్యాష్‌ట్యాగ్‌తో షేర్‌ చేశాడు.

కన్నడ ఫ్యాన్స్ నుంచి ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది. అప్పును మీరిలా గుర్తుచేయడం మా హృదయాలను ద్రవింపజేసింది. ధన్యవాదాలు అంటూ వార్నర్‌కు థాంక్స్‌ చెబుతున్నారు. మరోవైపు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు టైటిల్‌ సాధించిపెట్టిన డేవిడ్‌ వార్నర్‌.. వేలంలో భాగంగా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందా అని ఓ అభిమాని అడిగాడు. ఇందుకు స్పందించిన వార్నర్‌.. అది చాలా కష్టమన్నట్లుగా కామెంట్‌ చేశాడు.


అదే సమయంలో మరో నెటిజన్‌.. " మరి కర్ణాటకకు ఆడతారా? అదే.. ఆర్సీబీలో చేరతారా " అంటూ ప్రశ్న సంధించాడు. ఇందుకు ఎమోజీలతో బదులిచ్చాడు వార్నర్‌. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో వార్నర్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) కు ఆడటం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఆర్సీబీ బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్‌ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), మహ్మద్‌ సిరాజ్‌ (రూ. 7 కోట్లు)ను రిటైన్‌ చేసుకోగా.. సన్‌రైజర్స్‌ వార్నర్‌ను వదిలేసింది. మరోవైపు.. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలగడంతో వార్నర్‌ జట్టులోకి వస్తే అతడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : రొమాంటిక్ నైట్ డేట్ కు వెళ్లిన సచిన్ కూతురు.. సారా చేయి పట్టుకున్న వ్యక్తి ఎవరు..?

డేవిడ్ వార్నర్ గతేడాది లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా చేసిన ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు.

First published:

Tags: Cricket, David Warner, IPL 2022, Puneeth RajKumar, Royal Challengers Bangalore, Viral Video

ఉత్తమ కథలు