ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్... తాజాగా రూట్ మార్చాడు. అతనిప్పుడు మార్ఫ్డ్ ఫేస్ యాప్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ల లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. డైలాగులు ఇరగదీస్తున్నాడు. సన్ రైజర్స్ జట్టులో (SunRisers Hyderabad) ఉన్నప్పుడు తెలుగు హీరోల డైలాగులు, సాంగ్స్ తో రెచ్చిపోయిన డేవిడ్ బాయ్.. ఇప్పుడు ఆ జట్టును వీడినా మన స్టార్లను మాత్రం వదలడం లేదు. లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అప్‌కమింగ్ మూవీ 'పుష్ప'ను కూడా ఈ ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ విడిచిపెట్టలేదు. ఓ వైపు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉంటూనే.. తెలుగు సినిమా అప్డేట్స్ను ఫాలో అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఫేస్ యాప్ టెక్నాలజీ సాయంతో పుష్ప సినిమాలోని 'యే బిడ్డా.. ఇది నా అడ్డా'అనే పాటను ఇమిటేట్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకొని క్యాప్షన్ ఇవ్వాలని అభిమానులను కోరాడు. ఇక ఈ వీడియోను చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నర్‌పై సెటైర్లు వేశాడు. " బ్రో.. నీవు బాగానే ఉన్నావ్! " కదా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. " నువ్వు నా తల గురించే అడుగుతున్నావని తెలుసు.. కొంచెం గొంతు పట్టేసిందంతే " అని రిప్లై ఇచ్చాడు.
View this post on Instagram
ఇక, డేవిడ్ వార్నర్ వీడియోపై కోహ్లీ స్పందించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో వార్నర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కు ఆడటం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఆర్సీబీ బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు)ను రిటైన్ చేసుకోగా.. సన్‌రైజర్స్ వార్నర్‌ను వదిలేసింది. మరోవైపు.. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలగడంతో వార్నర్ జట్టులోకి వస్తే అతడు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను చూసి తెగ సంతోషపడుతున్నారు. కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇక గతంలో కూడా వార్నర్.. అల్లు అర్జున్ పాటకు చిందేశాడు. అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ పాటకు సతీమణి క్యాండీస్ వార్నర్‌తో కలిసి చిందేసాడు. అప్పట్లో ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎంతలా అంటే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు హీరో అల్లు అర్జున్ స్పందించేంత పాపులర్ అయింది.
ఇది కూడా చదవండి : " విరాట్ కోహ్లీ ఫోన్ స్విచ్ఛాఫ్.. అసలేం జరుగుతుందో అర్ధం కావట్లేదు.. "
డేవిడ్ వార్నర్ గతేడాది లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, David Warner, Pushpa film, Royal Challengers Bangalore, Virat kohli