హోమ్ /వార్తలు /క్రీడలు /

David Warner : తనదైన స్టైల్ లో 2020కి ముగింపు ఇచ్చిన డేవిడ్ వార్నర్..ఇంతకీ ఏం చేశాడంటే..

David Warner : తనదైన స్టైల్ లో 2020కి ముగింపు ఇచ్చిన డేవిడ్ వార్నర్..ఇంతకీ ఏం చేశాడంటే..

డేవిడ్ వార్న‌ర్

డేవిడ్ వార్న‌ర్

David Warner : ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా చేసిన ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. మరికొద్దిగంటల్లో ఈ ఏడాది కాలగర్భంలో కలుస్తున్న నేపథ్యంలో వార్నర్‌ తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ఇంకా చదవండి ...

  ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా చేసిన ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. లాక్ డౌన్ ను మనోడు మాములుగా ఉపయోగించుకోలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. క్రికెట్ లేక‌పోవ‌డం వ‌ల‌న ఇంటికి ప‌రిమిత‌మైన వార్న‌ర్ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి డ్యాన్స్‌లు చేయ‌డం, పాపుల‌ర్ సినిమా డైలాగుల‌కు త‌న‌దైన స్టైల్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం వంటివి చేస్తూ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించాడు.తెలుగు సినిమా పాటలు, డైలాగులతో పలువురు టాలీవుడ్‌ టాప్‌ హీరోల అనుకరణ వీడియోలు రూపొందించాడు. దాంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు మరింత చేరువయ్యాడు. మరికొద్దిగంటల్లో ఈ ఏడాది కాలగర్భంలో కలుస్తున్న నేపథ్యంలో వార్నర్‌ తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

  ఐపీఎల్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్న‌ప్ప‌టి నుండి వార్న‌ర్‌కు తెలుగు ప్రేక్ష‌కులు, ఇక్క‌డి సినిమాల‌తో మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న చాలా తెలుగు సినిమాల‌కు టిక్‌టాక్ వీడియోలు చేశాడు. తాజాగా వార్న‌ర్ మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ “మహర్షి” సినిమా నుంచి రీఫేస్ యాప్ తో తానే ఓ మహర్షిలా కనిపించి షాకిచ్చాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో మ‌హేష్ ఫేస్‌కు బ‌దులు త‌న ఫొటోని యాడ్ చేసి సరికొత్త వీడియో షేర్ చేశాడు వార్న‌ర్. దీంతో ఇలా ఈ ఏడాదిని ముగిస్తున్నాను అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం వార్న‌ర్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.
  స్కూటర్‌పై మహేశ్‌.. వెన్నెల కిషోర్‌తో వెళ్లే సీన్‌తో పాటు డైలాగులు, ఫైటింగ్‌ల సీన్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌‌ అదరగొట్టాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోవడంతో అభిమానులు లైకులు కొడుతున్నారు.గాయంతో బాధపడుతున్న వార్నర్ ఫస్ట్ రెండు టెస్ట్ లకు దూరమయ్యాడు. అయితే, సిడ్నీ టెస్ట్ కి వార్నర్ ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Allu Arjun, David Warner, Instagram, Mahesh babu

  ఉత్తమ కథలు