Watch: శిల్పా శెట్టిని చూసి నవ్వు ఆపుకోలేకపోయిన డేవిడ్ వార్నర్

తన ఫన్నీ వీడియోలతో భారత క్రికెట్ అభిమానులతో పాటు సినీ అభిమానులకు కూడా దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు.

news18-telugu
Updated: June 13, 2020, 9:16 AM IST
Watch: శిల్పా శెట్టిని చూసి నవ్వు ఆపుకోలేకపోయిన డేవిడ్ వార్నర్
డేవిడ్ వార్నర్ డ్యాన్స్ (TikTok/Photo)
  • Share this:
లాక్‌డౌన్‌లో మ్యాచ్‌లేవీ లేకున్నా ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. సోషల్ మీడియాలో రోజుకో వీడియోను రిలీజ్ చేస్తూ నవ్వుల పంట పండిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మన దేశ సినిమాల్లోని పాటలు, డైలాగులపై ఆసక్తిని చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’లోని డైలాగ్‌ చెప్పి సోషల్ మీడియాలో సంచలం సృష్టించాడు. డేవిడ్ వార్నర్, అతని భార్య, పిల్లలతో కలిసి ఈ వీడియోలు చేస్తున్నాడు. రాములో రాములా...బుట్టబొమ్మ..మైండ్ బ్లాంక్ పాటలకు వారు చేసిన డ్యాన్స్‌ను చూసి తెలుగు ప్రేక్షకులే కాదు..అందరూ ఫిదా అయ్యారు. వార్నర్ షేర్ చేసిన వీడియోను చూసి స్వయంగా అల్లు అర్జున్ కూడా మెచ్చుకున్నాడు.

తాజాగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఫన్నీ వీడియోతో తాను చేసిన టిక్ టాక్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడీ ఆసీస్ క్రికెటర్. శిల్పా శెట్టి ఒపెరా పాడుతూ...ఫిల్టర్ సాయంతో ఫన్నీ ముఖ కదలికలతో ఈ వీడియో ఉంది. ఇందులో శిల్పా శెట్టిని చూసి నవ్వు ఆపుకోలేక పడీపడీ నవ్వాడు. ఈ వీడియోను చూసి తాను నవ్వు ఆపుకోలేకపోయినట్లు కామెంట్ పెట్టాడు.










View this post on Instagram





This made me laugh so much😂😂 crazy time @theshilpashetty


A post shared by David Warner (@davidwarner31) on






తన ఫన్నీ వీడియోలతో భారత క్రికెట్ అభిమానులతో పాటు సినీ అభిమానులకు కూడా దగ్గరయ్యాడు డేవిడ్ వార్నర్. సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు.
Published by: Janardhan V
First published: June 13, 2020, 9:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading