• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • DAVID WARNER AND MICHEAL SLATER PHYSICAL BRAWL IN MALDIVES BAR BOTH RESPONDS TO REPORTS JNK

IPL 2021: తాగి కొట్టుకున్న వార్నర్, స్లేటర్.. మాల్దీవుల్లో రచ్చ చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు?

IPL 2021: తాగి కొట్టుకున్న వార్నర్, స్లేటర్.. మాల్దీవుల్లో రచ్చ చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు?

మాల్దీవుల్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ల రచ్చ రచ్చ

మాల్దీవుల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రచ్చ చేశారు. అక్కడి ఒక బార్‌లో తాగిన తర్వాత చెలరేగిన వివాదం చివరకు బాహాబాహీ వరకు వచ్చింది. ఇంతకు ఎందుకు వార్నర్, స్లేటర్ మధ్య గొడవ వచ్చింది?

  • Share this:
    ఐపీఎల్ (IPL 2021) వాయిదా (Postpone) పడటంతో విదేశీ క్రికెటర్లు అందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం తాత్కలిక నిషేధం విధించడంతో ఆసీస్ ఆటగాళ్ల ప్రయాణాలు వాయిదా పడ్డాయి. ఇండియాలో ఉండలేమని వారు చెప్పడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాల్లో మాల్దీవులకు తరలించారు. ప్రస్తుతం మాల్దీవుల్లోని (Maldives) తాజ్ కోరల్ రిసార్టులో (Taj Coral Resort) బస చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner), స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ మైఖెల్ స్లేటర్ (Micheal Slater) ఇద్దరూ అదే రిసార్టులో బస చేస్తున్నారు. అయితే గత రాత్రి అక్కడి బార్‌లో ఇద్దరు కలసి తాగిన తర్వాత ఒక విషయంపై వాగ్వివాదం చెలరేగిందని.. అది కాస్తా ముదరడంతో ఆస్ట్రేలియన్లు ఇద్దరూ బాహాబాహీకి దిగినట్లు ది డైల్ టెలిగ్రాఫ్ అనే పత్రిక ఒక కథనం వెలువరిచింది. చాలా ఏళ్లుగా వార్నర్, స్లేటర్ మంచి స్నేహితులుగా ఉంటున్నారు. క్రికెట్ లేని సమయంలో సరదాగా పబ్, బార్లకు వెళ్లడం వారిద్దరికీ అలవాటే. ఐపీఎల్ వాయిదా పడటంతో వార్నర్, అంతకు ముందే మైఖేల్ స్లేటర్ మాల్దీవులకు చేరుకున్నారు. అయితే ఏ విషయంలో తేడా వచ్చిందో తెలియదు కానీ ఇద్దరూ కొట్టుకునే వారకు వెళ్లినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

    కాగా, ఈ కథనాన్ని ఇద్దరు క్రికెటర్లు ఖండించారు. అసలు ఏ మాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు కథనాన్ని ఎలా ప్రచురిస్తారంటూ సదరు పత్రికపై విరుచుకపడ్డారు. మైఖేల్ స్లేటర్ ఈ కథనంపై స్పందించి సీనియర్ జర్నలిస్ట్ రోత్‌ఫీల్డ్‌కు ఒక సందేశం పంపాడు. 'వార్నర్ నేను మంచి స్నేహితులం. అసలు మా మధ్య గొడివ జరిగే అవకాశమే లేదు. ఇలా పుకార్లను ఎందుకు పుట్టిస్తారో' అని స్లేటర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత వార్నర్ కూడా ఆ జర్నలిస్టుకు అలాంటి సందేశమే పంపాడు. 'ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టిస్తారో ఏమో. మా మధ్య అసలు ఎలాంటి డ్రామా జరగలేదు. మీరు కళ్లతో చూసి... అక్కడ ఉండి వార్తలు రాస్తే బాగుంటుంది. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాయవద్దు' అంటూ కాస్త ఘాటుగానే మెసేజ్ చేశాడు.

    Murder : స్టార్ రెజ్లర్ కోసం గాలిస్తున్న 50 మంది పోలీసులు.. హత్య జరిగిన రోజు ఏం జరిగింది?


    కాగా, ముందుగా మాల్దీవులకు చేరుకున్న స్లేటర్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ లక్ష్యంగా పలు ట్వీట్లు చేశారు. మీ చేతులకు రక్తం అంటించుకోవద్దని హితవు కూడా పలికాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ కోల్పోయిన డేవిడ్ వార్నర్ ఒక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత లీగ్ వాయిదా పడింది. అయితే స్లేటర్ మాల్దీవుల్లో ఉన్నప్పుడే ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ అతడికి ఫోన్ చేసి వాగ్వివాదానికి దిగినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్లేటర్, వార్నర్ గొడవ రూమర్లు రావడంతో అప్పుడు కూడా గొడవ పడింది వీరిద్దరే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు