డేవిడ్ వార్నర్ నోట మహేష్ బాబు పోకిరి డైలాగ్..

David Warnar: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య ఇండియన్ సినిమాలపై.. అందులో తెలుగు సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ మధ్యే బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2020, 4:34 PM IST
డేవిడ్ వార్నర్ నోట మహేష్ బాబు పోకిరి డైలాగ్..
మహేష్ పోకిరి డైలాగ్ చెప్పిన డేవిడ్ వార్నర్ (mahesh david warnar)
  • Share this:
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య ఇండియన్ సినిమాలపై.. అందులో తెలుగు సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ మధ్యే బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేసాడు డేవిడ్. ఈయన చేసిన పాటకు అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. సూపర్ డేవిడ్ అంటూ అంతా ప్రశంసించారు. ఇక మొన్నటికి మొన్న కమల్ హాసన్ పాటకు కూడా స్టెప్పులేసాడు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. 14 ఏళ్ల కింద సూపర్ స్టార్ నటించిన పోకిరి సినిమాలోని డైలాగ్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ చెప్పాడు.


ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇప్పుడు బ్యాటు పట్టుకుని డేవిడ్ చెప్పాడు. వచ్చీరాని తెలుగులో లిప్ సింక్ ఇస్తూ ఈ క్రికెటర్ చెప్పిన విధానం కూడా అందర్నీ కట్టి పడేస్తుంది. వరసగా తెలుగు సినిమాలకు అలవాటు పడిపోతున్నానని చెప్తున్నాడు ఈయన. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆడుతున్న డేవిడ్ వార్నర్ కుటుంబంతో పాటు ఇక్కడే ఉన్నాడు.

ఐపిఎల్ ఉంటుందో లేదో తెలియదు కానీ డేవిడ్ మాత్రం ఈ సీజన్ అయిపోయే లోపు తెలుగు నేర్చుకునేలా కనిపిస్తున్నాడు. ఈయన డైలాగ్ చూసి పూరీ జగన్నాథ్ కూడా ట్వీట్ చేసాడు. నువ్వు మంచి యాక్టర్ కూడా.. నా సినిమాలో చేస్తావా అని అడిగాడు. దీనికి డేవిడ్ కూడా ప్రయత్నించాను సర్ అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ అయిపోతున్నాడు.
First published: May 10, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading