Ranji Trophy: రంజీ జట్టుకు అంతర్జాతీయ కోచ్.. ఆస్ట్రేలియా నుంచి భారీ వేతనంతో బరోడాకు కోచింగ్

బరోడా రంజీ జట్టుకు ఆస్ట్రేలియన్ కోచ్.. భారీ వేతనంతో నియామకం (PC: BCCI)

Ranji Trophy: గత కొన్ని సీజన్లుగా దేశవాళీ క్రికెట్‌లో సరైన ప్రదర్శన చేయలేకపోతున్న బరోడా క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ కోచ్‌ను నియమించారు. శ్రీలంకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన డేవ్ వాట్‌మోర్ ఈ సీజన్‌లో రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

  • Share this:
    కరోనా (Corona) కారణంగా గత సీజన్ రంజీ ట్రోఫీ (Ranji Trophy) పూర్తిగా రద్దు చేశారు. ఇక ఈ ఏడాది నవంబర్ నుంచి రంజీ ట్రోఫీ నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అన్ని క్రికెట్ జట్లు తమ సన్నాహకాలు మొదలు పెట్టాయి. దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు కలిగిన బరోడా క్రికెట్ జట్టు (Baroda Cricket Team) ఈ మధ్య పెద్దగా విజయాలు సాధించడం లేదు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Sayed Nustak Ali Trophy) బరోడా లీగ్ స్థాయిలో అన్ని మ్యాచ్‌లు గెలిచింది. కానీ కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టు నాకౌట్‌లో ఓడిపోయింది. ఇక ఈ సారి దేశవాళీలో మంచి ప్రదర్శన చేయాలనే ఉద్దేశంలో బరోడా క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ కోచ్‌ను నియమించింది. ఆస్ట్రేలియాకు చెందిన డేవ్ వాట్‌మోర్‌ను (Dav Whatmore) బరోడా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది.

    డేవ్ వాట్‌మోర్ ప్రపంచంలోనే అత్యంత అనుభవం కలిగిన క్రికెట్ కోచ్. ఆయన గత మూడు దశాబ్దాలుగా పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. డేవ్ వాట్‌మోర్ కోచింగ్ స్కిల్స్ 1996లో ప్రపంచ క్రికెట్‌కు తెలిసి వచ్చింది. వన్డేల్లో తొలి 15 ఓవర్లు ఉండే ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఉపయోగించుకొని బ్యాటర్లు ఎలా చెలరేగిపోవాలో వాట్‌మోర్ చేసి చూపించాడు. 1996లో శ్రీలంకజట్టు తొలిసారిగా ఈ వెసులు బాటును ఉపయోగించుకొని చెలరేగిపోయింది. సనత్ జయసూర్య, అర్జున రణతుంగ వంటి ప్లేయర్లు ఆకాశమే హద్దుగా ఆడి ఆ ఏడాది శ్రీలంకకు ప్రపంచ కప్ సాధించిపెట్టారు. ఇందులో డేవ్ వాట్‌మోర్ పాత్ర చాలా కీలకం. అప్పటి నుంచి పలు జట్లకు డేవ్ వాట్‌మోర్ కోచ్‌గా వ్యవహరించాడు.

    Inzamam-ul-Haq : పాక్ దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ కు గుండెపోటు.. ఆందోళనలో ఫ్యాన్స్..!






    శ్రీలంక కోచ్‌ పదవి వదిలేసిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో 2010, 2011లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. టీమ్ ఇండియాకు కోచ్‌గా రావడానికి దరఖాస్తు చేసుకున్నా.. ఆ పదవి రవిశాస్త్రికి వెళ్లింది. కాగా, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా 2007లో పని చేశాడు. ఆ తర్వాత ఇండియా అండర్ 19 జట్టు కోచ్‌గా మారాడు. విరాట్ కోహ్లీ 2008లో అండర్ 19 కెప్టెన్‌గా ఉన్న సమయంలో వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు జట్టుకు డేవ్ వాట్‌మోర్ కోచ్‌గా ఉన్నాడు.

    Moeen Ali: ఇండియాతో మ్యాచ్ రద్దు కావడంతో మొయిన్ అలీ నిరాశ చెందాడా? అందుకే రిటైర్మెంట్ నిర్ణయం?




    సింగపూర్, నేపాల్ జట్లకు కూడా కోచ్‌గా పని చేసిన డేవ్ 2018-19 సీజన్‌లో కేరళ రంజీ జట్టుకు కోచ్‌గా పని చేశాడు.ఆ ఏడాది కేరళ జట్టు తొలిసారిగా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. తాజాగా బరోడా క్రికెట్ అసోసియేషన్ అతడికి రూ. 1 కోటి వేతనంతో కోచ్‌గా నియమించుకున్నది. దేశవాళీ క్రికెట్‌లో ఏ కోచ్‌కు అయినా ఇదే అత్యధిక వేతనం కావడం గమనార్హం.
    Published by:John Naveen Kora
    First published: