హోమ్ /వార్తలు /క్రీడలు /

Danushka Gunathilaka : వివాదాస్పద శ్రీలంక మాజీ క్రికెటర్ గుణతిలకకు ఊరట..అందుకు ఒప్పుకున్న సిడ్నీ కోర్టు

Danushka Gunathilaka : వివాదాస్పద శ్రీలంక మాజీ క్రికెటర్ గుణతిలకకు ఊరట..అందుకు ఒప్పుకున్న సిడ్నీ కోర్టు

PC : TWITTER

PC : TWITTER

Danushka Gunathilaka : శ్రీలంక (Sri Lanka) మాజీ క్రికెటర్ ధనుష్క గుణతిలకకు భారీ ఊరట లభించింది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) వెళ్లి అత్యాచారం చేసులో గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Danushka Gunathilaka : శ్రీలంక (Sri Lanka) మాజీ క్రికెటర్ ధనుష్క గుణతిలకకు భారీ ఊరట లభించింది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆడేందుకు ఆస్ట్రేలియా (Australia) వెళ్లి అత్యాచారం చేసులో గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత వారం నుంచి అతడు ఆస్ట్రేలియాలో ఊచలు లెక్కబెడుతున్నాడు. తాజాగా అతడికి సిడ్నీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో అక్కడి పోలీసులు గుణతిలకను అరెస్టు చేశారు.  గత 11 రోజులగా గుణతిలక జైలులోనే ఉండగా.. బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. దాంతో గుణతిలక అక్కడి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో సిడ్నీ అత్యున్నత న్యాయస్థానం గుణతిలకకు 150,000 ఆస్ట్రేలియన్ డాలర్ల(రూ, కోటి రూపాయలు) పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా అతడిని దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకుంది.

వీటితో పాటు మరికొన్ని షరతులను విధించింది. రెండు రోజులకు ఒకసారి పోలీసులకు రిపోర్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని.. అదే సమయంలో తనపై ఫిర్యాదు చేసిన మహిళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదని కూడా హెచ్చరించింది. అంతేకాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గుణతిలకపై నిఘా ఉంటుందని, తనపై ఫిర్యాదు చేసిన మహిళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదని కూడా హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 12న జరగనుంది.

ఏం జరిగిందంటే?

టి20 ప్రపంచకప్ లో ఆడేందుకు వెళ్లినా గాయంతో అతడు మెగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే శ్రీలంక మేనేజ్ మెంట్ మాత్రం అతడిని తమతోనే అంటిపెట్టుకుంది. ఈ క్రమంలో ధనుష్క డేటింగ్ యాప్ 'టిండర్‌'లో ఒక మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరూ వారాల పాటు చాట్ చేసుకున్నారు. వీరు సిడ్నీలోని ఒపెరా బార్‌లో మొదటిసారి ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు, అయితే నెక్స్ట్ డే మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో వీరు రోజ్‌బేకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.

ఇది కూడా చదవండి  : ఎక్కడో కాలుతున్నట్లుంది ఈ బర్నల్ రాసుకో.. నోటి దూల కెప్టెన్ కు కౌంటర్ ఇచ్చిన జాఫర్

అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్

అరెస్ట్ అయిన గుణతిలకను అక్కడే వదిలేసిన శ్రీలంక జట్టు స్వదేశానికి పయనం కాగా.. అన్ని ఫార్మాట్ల నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. గుణతిలక లంక తరఫున ఇప్పటి వరకు 47 వన్డేలు, 46 టీ20లు, 8 టెస్ట్‌లు ఆడాడు. గుణతిలకకు వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ గుణతిలక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నార్వే మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో శ్రీలంక బోర్డు 6 మ్యాచ్‌లు నిషేధించింది.

First published:

Tags: Australia, Sexual harrassment, Sri Lanka, T20 World Cup 2022

ఉత్తమ కథలు