హోమ్ /వార్తలు /క్రీడలు /

Novak Djocovic: జకోవిచ్ నెంబర్ వన్ స్థానానికి ఎసరు? వరుస పరాజయాలతో డీలా.. దూసుకొస్తున్న యువ ఆటగాళ్లు

Novak Djocovic: జకోవిచ్ నెంబర్ వన్ స్థానానికి ఎసరు? వరుస పరాజయాలతో డీలా.. దూసుకొస్తున్న యువ ఆటగాళ్లు

నొవాక్ జొకోవిచ్ (ఫైల్ ఫోటో)

నొవాక్ జొకోవిచ్ (ఫైల్ ఫోటో)

Novak Djocovic: పురుషుల నెంబర్ 1 ఆటగాడు నోవాక్ జకోవిచ్ తన అగ్ర ర్యాంకును కోల్పోనున్నాడా? వరుస పరాజయాలతో సీజన్ ముగించిన జకోవిచ్ తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

  వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ (Tennis) ప్లేయర్ నోవాక్ జకోవిచ్ (Novak Djocovic) పని ఇక అయిపోయిందా? 2021ని ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) విజయంతో ఘనంగా ప్రారంభించిన జకోవిచ్.. ఏడాది చివరలో వరుస పరాజయాలు మూట గట్టకోవడం దేనికి సంకేతం? టెన్నిస్ కోర్టులో అతడి రాకెట్ పదును తగ్గిందా? వయసు మీదపడుటుండటంతో ఆల్ టైం గ్రేట్ రికార్డు సాధిస్తాడా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెర్బియాకు చెందిన స్టార్ ప్లేయర్ జకోవిచ్ ఈ ఏడాది చాలా అద్భుతంగా ప్రారంభించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ (French Open), వింబుల్డన్ (Wimbledon) గెలిచి.. గోల్డెన్ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. జకోవిచ్ దూకుడు చూసిన క్రీడా విశ్లేషకులు కూడా జకోవిచ్ ఈ ఏడాది ముగిసేలోగా అద్భుతం సృష్టించడం ఖాయమనే అనుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం తప్పక సాధిస్తాడని అనుకున్నా.. జకోవిచ్ పరాజయాలు అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్‌లో సెమీస్‌లోనే వెనుదిరిగిన ఈ వీరుడు.. ఆ తర్వాత యూఎస్ ఓపెన్ కూడా ఓడిపోయి కనీసం క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ కల కూడా నెరవేర్చుకోలేకపోయాడు. రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్‌తో సమానంగా 20 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు గెలిచిన జకోవిచ్.. వారి రికార్డును దాటలేకపోయాడు.

  ఈ ఏడాది ఏటీపీ టూర్‌ను గెలిచి రోజర్ ఫెదరర్ సాధించిన 6 టైటిల్స్ రికార్డును సమం చేయాలని జకోవిచ్ భావించాడు. కానీ సెమీస్‌లో జ్వరేవ్ చేతిలో ఓడిపోయాడు. ఇలా 2021 రెండో అర్దభాగమంతా పరాజయాలతోనే జకోవిచ్ నెట్టుకొచ్చాడు. దీంతో అతడి నెంబర్ 1 స్థానానికి యువ క్రీడాకారులు ఎసరు పెట్టడానికి రెడీగా ఉన్నారు. వచ్చే ఏడాది తాను గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను డిఫెండ్ చేసుకుంటే కానీ అగ్రస్థానాన్ని కాపాడుకోలేడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ పురుషుల టెన్నిస్‌లో దూసుకొని వస్తున్నాడు. జర్మనీకి చెందిన ఈ టెన్నిస్ స్టార్ చడీ చప్పుడు లేకుండా వరుస విజయాలతో తన కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న వారికి షాకులు ఇస్తున్నాడు.

  IND vs NZ: హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కనుగొన్న హార్దిక్ పాండ్యా.. ఆ యువ క్రికెటర్ పాండ్యా స్థానానికి ఎసరు


  టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం గెలిచిన జ్వరేవ్.. ఏటీపీ టూర్ ఫైనల్ టోర్నీలో.. జకోవిచ్‌ను సెమీఫైనల్‌లోనే ఓడించాడు. ప్రస్తుతం జకోవిచ్ - జ్వరేవ్ మధ్య 4000 పాయింట్ల అంతరం ఉన్నది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ఓపెన్‌లలో కనుక జకోవిచ్‌ను ఓడించగలిగితే.. మరిన్ని రేటింగ్ పాయింట్‌లు జ్వెరెవ్ సొంతం అవుతాయి. మరోవైపు జకోవిచ్‌కు మెద్వెదేవ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతున్నది. వీరిద్దరినీ వచ్చే ఏడాది ఓడిస్తే కాని జకోవిచ్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోలేడు.

  IPL 2022: 'మా ఇద్దరినీ ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవడం లేదు'.. బాంబు పేల్చిన సీనియర్ టీమ్ ఇండియా క్రికెటర్


  ఓపెన్ ఎరాలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రికార్డు ప్రస్తుతం ముగ్గురి చేతిలో ఉన్నది. రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్, నోవాక్ జకోవిచ్ తలా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచారు. వీరిలో ఎవరు మరో గ్రాండ్‌స్లామ్ గెలిచినా ఆల్ టైం రికార్డు సాధిస్తారు. ప్రస్తుతం రోజర్ ఫెదరర్ ఆటపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. వరుస గాయాలు, శస్త్ర చికిత్సల కారణంగా ఫెదరర్ పెద్దగా రాణించడం లేదు. ఇక రఫెల్ నదాల్ గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకుండా పోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో జకోవిచ్ చేతిలోనే ఓడిపోయాడు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పాడు.

  SMAT: ధోనీ చూస్తుండగా.. అతడి స్టైల్‌లోనే ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.. వచ్చే ఏడాది సీఎస్కేలోకి వస్తాడా?


   నదాల్ ఈ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు మిగతా గ్రాండ్‌స్లామ్స్ ఆడతాడో లేదో స్పష్టత లేదు. తనకు బాగా కలసి వచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనే మరోసారి లక్ పరీక్షించుకునే అవకాశం ఉన్నది. దిగ్గజ ప్లేయర్ల గైర్హాజరీలో జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. రాబోయే ఏడాదిలో తన టైటిల్స్‌ను డిఫెండ్ చేసుకోవడం ద్వారా జకోవిచ్ ఆల్ టైం రికార్డుసాధించడమే కాకుండా అగ్రస్థానాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉన్నది. అయితే జ్వరేవ్, మెద్వెదేవ్, రూబ్లేవ్ రూపంలో అతడికి యువ ప్లేయర్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. మరి ఆ పోటీని తట్టుకొని నిలబడితేనే తన కల నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది.

  Published by:John Kora
  First published:

  Tags: French open, Novak Djokovic, Tennis, Wimbledon

  ఉత్తమ కథలు